Ambati Rambabu: సినిమాలలో మనల్ని నవ్వించేందుకు ఇండియన్ సైకాలజీ అనే సీన్స్ ఉంటాయి చూశారా.. అదేనండీ మనం బాగు పడకున్నా, ఎదుటివాడు నాశనమైతే వచ్చే ఆ కిక్కే వేరప్పా అనే డైలాగ్ వచ్చే సీన్స్. సేమ్ టు సేమ్ అదే థియరీ పాటించారట ఈ వైసీపీ నేత. తన పార్టీ నేతల ఓటమిని చూసి, తాను ఓడినా ప్రశాంతంగా నిద్ర పోయారట ఈయన. ఈ మాటలన్నది కూడా ఆ నేతనే.
అన్ని రంగాలలో రాజకీయం రంగమే వేరు. రాజకీయాలలో రాణించాలంటే కాస్త లౌక్యం ఉండాలి. లేకుంటే అంతే సంగతులు. అప్పుడప్పుడు కుప్పి గంతులు కూడా అవసరమే. కానీ గతి తప్పి అధికారం ఉండదా.. మన స్థితి మార్చుకోవాల్సిందే. లేకుంటే అంతా భ్రాంతియేనా పాటెత్తుకోవాల్సిందే. అందుకే ప్రతి పొలిటికల్ లీడర్.. ఎలాగైనా విజయాన్ని అందుకొనేందుకు తెగ తాపత్రయ పడతారు.
ఓటమి పాలైతే ఆ లీడర్ కు కన్నీళ్లే.. మిగిలాయి నేస్తమంటూ పాటెత్తు కోవాల్సిందే. అందుకే పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, లీడర్స్ కి మాత్రం గెలుపు కావాల్సిందే. ఓటమి చెందితే చాలా వరకు లీడర్స్ కి కోలుకోలేని ఇబ్బందులు తప్పవు. అందుకే ఓ నేత తన ఓటమి కెరీర్ గురించి పూస గుచ్చినట్లు చెప్పి తన బాధ వెళ్ళగక్కారు. ఆయనెవరో కాదు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.
తాజాగా అంబటి మాట్లాడుతూ.. తాను మాజీ సీఎం జగన్ కంటే ముందు రాజకీయాల్లో ఉన్నానని, వైఎస్సార్ కు అనుచరుడిగా ఉన్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోతే, తనకు 6 నెలలు నిద్ర పట్టలేదని తన ఆవేదన వెళ్ళగక్కారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 28 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను. కానీ తనకు నిద్ర పట్టిందన్నారు. ఇక్కడే అంబటి సూపర్ కామెంట్స్ చేశారు. తన పార్టీ వాళ్ళు ఒకరు 90 వేలు, 70 వేలు, 50 వేలు ఓట్ల తేడాతో ఓడిపోయారని, వారిని చూసి తనకు నిద్ర ఫుల్ గా పట్టిందని అంబటి కుండబద్దలు కొట్టారు.
Also Read: AP 10th Exams Schedule 2025: ఏపీలో పది ‘పబ్లిక్’ పరీక్షల షెడ్యూల్ విడుదల..
తాను గెలవలేదు కాబట్టి, ఎదుటి వారు ఓడిపోతే నిద్ర పట్టిందని అంబటి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అంబటి ఈ కామెంట్స్ చేసిన సమయంలో అక్కడి పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా.. ఇదేమి ఆనందమయా.. పార్టీ బ్రతకాలని కోరుకోవాలి కానీ, నేను ఓడిపోయా.. వాళ్ళు కూడా నాలాగే ఓడిపోయారని ఆనంద పడుతున్నాడు అంబటి అంటూ ట్రోలింగ్ సాగుతోంది. దీనిని బట్టి అంబటి ఏదైనా కుండబద్దలు కొట్టేస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద అంబటికి ఓటమి బాధ లేకుండ చేసిన, ఆ ఓటమి పాలైన నేతలు ఎవరో మరీ.. ఇంతకు వారిపై అంబటికి అంత కసి ఏలనో అంటూ తెగ చర్చ సాగుతోంది.
జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే నేను ఉన్నా..
కార్యకర్తల సమావేశంలో అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 28 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను
ఏం చేయాలో తెలియక రెండు రోజులు బయటకు రాలేదు
కానీ మరో వ్యక్తి 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయేసరికి నాకు ధైర్యం వచ్చింది
2014… pic.twitter.com/bitlTSlhwo
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2024