E-Paper
Advertisement

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!
Advertisement

Delhi Metro Reopens All Stations: ఢిల్లీలో మెట్రో ప్రయాణికులకు ఊరట లభించింది. నిరసన కార్యక్రమం నేపథ్యంలో భద్రతా కారణాలతో మూసివేసిన మెట్రో స్టేషన్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ లోని అన్ని స్టేషన్లలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. సుమారు 25 గంటల పాటు కొనసాగిన ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు ఇప్పుడు.. కాస్త రిలాక్స్ అయ్యారు. మరోవైపు, రైలు సర్వీసులు కూడా సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది.

అన్ని మెట్రో స్టేషన్లలో సాధారణ సేవలు!

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ తలపెట్టిన నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి మెట్రో స్టేషన్లపై ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయంలో భాగంగా మొదట 57 స్టేషన్లు క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 45కు తగ్గించారు. శనివారం రాత్రి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అన్ని స్టేషన్లను ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఇప్పుడు మెట్రో రైళ్ల ద్వారా ప్రయాణం చెయ్యొచ్చని ప్రకటించింది.

కీలక మెట్రో స్టేషన్లపై ఆంక్షలు!

Advertisement

భద్రతా చర్యల్లో భాగంగా రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, జన్‌పథ్, మండి హౌస్, ఐటీఓ, కాశ్మీర్ గేట్, న్యూఢిల్లీ లాంటి ప్రధాన స్టేషన్లలో ఆంక్షలు విధించారు. ఈ స్టేషన్లు నగరంలోని కీలక ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉందన్న సమాచారంతో ఢిల్లీ పోలీసుల సూచన మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

రైలు సర్వీసులు కూడా యథావిధిగా

మెట్రో సేవలతో పాటు రైల్వే సర్వీసులపైనా ఢిల్లీలో ఆంక్షల ప్రభావం పడింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు వచ్చే, అక్కడి నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 245 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. స్టేషన్ల పరిసరాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని రైల్వే ప్రకటించింది. అయినప్పటికీ, ప్రయాణికులు తమ రైలు స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

సుప్రీంకోర్టులో ఆంక్షలపై విచారణ!

Advertisement

మెట్రో, రైల్వే సేవలపై విధించిన ఆంక్షల విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పందించింది. రవాణా సదుపాయాలపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మెట్రో స్టేషన్లను మూసివేయడం, రైళ్లను రద్దు చేయడం, ప్రయాణికులకు సరైన ముందస్తు హెచ్చరికలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

Read Also: రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

Tags

Related News

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

Big Stories

Advertisement
×