BigTV English

Ravi Teja: రవితేజ కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట!

Ravi Teja: రవితేజ కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట!

Ravi Teja Son: ఎలాంటి బ్యాక్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా ఎదిగి మాస్ మహారాజ్ అయ్యాడు రవితేజ. హీరోగా తన జర్నీ ఎన్నో లక్షల మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. ఎన్ని కష్టాలు పడినా ఇష్టమైనదాన్ని వదులుకోకూడదు అని రవితేజను చూసి నేరచుకోవాలని అనుకుంటూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు హీరోగా ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇండస్ట్రీలో తన వారసుడి ఎంట్రీకి టైమ్ అయ్యిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ కుమారుడు మహాధన్ భూపతిరాజు తండ్రిలాగా హీరో అవ్వకుండా వేరే మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధపడ్డాడని సమాచారం.


ఆ డైరెక్టర్ దగ్గరే

రవితేజ కుమారుడు మహాధన్ ఇప్పటికే ఒకసారి వెండితెరపై వెలిగాడు. తన తండ్రి హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. దీంతో తన కుమారుడు కూడా తనలాగే హీరో అవుతాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మహాధన్ మాత్రం సొంత మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధపడ్డాడు. త్వరలోనే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అంతే కాకుండా ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌లాగా జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రముఖ డైరెక్టర్ మరెవరో కాదు.. ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీ చూపు మొత్తం తనవైపు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా. రవితేజ వారసుడు సందీప్‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: అప్పుడే ‘దేవర 2’ స్టార్ట్ చేస్తా.. కీలక అప్డేట్ ఇచ్చిన కొరటాల శివ

అసిస్టెంట్ డైరెక్టర్‌గానే మొదలు

దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా స్టైల్ చాలామందికి ఇష్టం. అందుకే మహాధన్ కూడా తాను ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనుకుంటే సందీప్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయితే బెటర్ అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మహాధన్‌కు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ లేదని, తను డైరెక్షన్‌పైనే ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో తనకు ఆన్ స్క్రీన్ అవకాశాలు రాకపోవడంతో రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే తన కెరీర్ ప్రారంభించాడని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. అలా తన మీద తనకు ఉన్న నమ్మకంతో అసిస్టెంట్ డైరెక్టర్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అక్కడ నుండి హీరోగా ఎదిగాడు మాస్ మహారాజ్.

వారసుల నిర్ణయం

సందీప్ రెడ్డి వంగా చివరిగా రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’తో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే ‘స్పిరిట్’తోనే దర్శకుడిగా తన జర్నీ ప్రారంభించాలని అనుకుంటున్నాడట మహాధన్. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యిందని అప్డేట్ కూడా బయటికొచ్చింది. మరోవైపు రవితేజ కుమార్తె మోక్షధా మాత్రం ప్రొడక్షన్‌పై ఆసక్తి చూపిస్తుందట. ఇప్పటికే నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్మెంట్స్ టీమ్‌లో తాను కూడా ఒక భాగమయినట్టు సమాచారం. మొత్తానికి మాస్ మహారాజ్ వారసులు తన అడుగులు ఫాలో అవ్వకుండా సొంతంగా కెరీర్ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం మంచిదే అని ఫ్యాన్స్ అంటున్నారు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×