SIR Controversy: దేశంలో ఎవరిని కదిపినా కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోన్న సర్ ప్రాసెస్ పై విమర్శలే వినిపిస్తాయి. రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలోనూ సర్ ప్రాసెస్ ఒక స్కాంగా తయారైందన్న అభిప్రాయాలే ఉన్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు చేపట్టే సర్ ప్రాసెస్ ద్వారా బిజెపి వ్యతిరేక ఓట్లు మాయం చేస్తున్నారని విపక్షాలు భగ్గుమంటున్నాయి. అదే సమయంలో బిజెపి అనుకూల ఓట్ల సంఖ్యను అమాంతం పెంచేస్తున్నారన్న వాదనా ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత విచిఎస్ఐఆర్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఈసీపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.త్రంగా అదనపు ఓటర్లను జాబితా నుంచి తొలగించేస్తున్నారు.దీనిపై ఇంత వరకు విపక్షాలు, మేథావుల నుండే విమర్శలు వచ్చాయి.
సర్ ప్రాసెస్ పై అనుమానాలు..
తాజాగా ఎలక్షన్ కమిసన్ లోని ఇద్దరు కమిషనర్లు ఓటర్ల తొలగింపు, చేర్పులపై గత 10నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా సిఇసి పట్టించుకోలేదని నోట్ లో పేర్కొన్నారు. సర్ ప్రాసెస్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు.2025 నుంచి ఇప్పటి వరకు 30 రాష్ట్రాల్లో 13కోట్లకు పైగా ఓట్లు తొలగించారు. ఈ విషయంలో తమని డార్క్ లో పెట్టారని కేబినెట్ కార్యదర్శికి కూడా ఈ కమిషనర్లు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని కథనాలు వచ్చాయి. ఈ కుంభకోణానికి జ్ఞానేష్ గేట్ అని పిలుస్తున్నారు విపక్ష నేతలు. సిఇసిని తప్పించాలని కొందరు ఆయన్ను అరెస్ట్ చేయాలని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. సిఇసి చరిత్రలో జ్ఞానేష్ కుమార్ ఎదుర్కొన్న విమర్శలు ఎవరిపైనా రాలేదు.
మంచిగా కాదు.. అందరూ తిట్టుకునేలా..
ఇదే కేంద్ర ఎన్నికల సంఘానికి 1990లో చీఫ్ కమిషనర్ గా నియమితులైన టి.ఎన్.శేషన్ మొత్తం వ్యవస్థనే గడ గడ లాడించారు. ఎన్నికలకు సంబంధించిన అద్భుతమైన సంస్కరణలన్నీ శేషన్ హయాంలోనే వచ్చాయి. ప్రభుత్వాలను.. రాజకీయ పక్షాల నేతలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ముక్కు సూటిగా వ్యవహరించిన టి.ఎన్.శేషన్ వచ్చే వరకు ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుందని కానీ.. దానికి విశేషమైన అధికారాలు ఉంటాయని కానీ ఎవ్వరికీ తెలీదు. శేషన్ తన డైనమిక్ అండ్ సిన్సియర్ వర్క్ తో చరిత్రలో నిలిచిపోయారు. ఫ్యూచర్ లో జ్ఞానేష్ కుమార్ కూడా చరిత్రలో నిలిచిపోతారు. కానీ మంచిగా కాదు. అందరూ తిట్టుకునేలా.
Also Read: నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు