Illu Illalu Pillalu Today Episode August 10th : ప్రేమ గుడికి ఎలాగైనా సరే వస్తే బాగుండు అని విశ్వం ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ప్రేమ ఏం చెప్పినా సరే తను మాత్రం ఏమీ అనకుండా తనని ఒప్పించి తీసుకురావాలి అని ప్లాన్ చేస్తాడు.. భద్ర సేన ఇద్దరు గుడికని ఉదయం రెడీ అయ్యి విశ్వం ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటారు.. విశ్వం మాత్రం బయట నిల్చని ఎలాగైనా సరే ప్రేమను కూడా గుడికి తీసుకుని రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ప్రేమ క్లాస్ కి వెళ్ళాలి అని రెడీ అయ్యి కిందకు వస్తుంది. విశ్వం ప్రేమని రెచ్చగొట్టి గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు.
విశ్వం అక్కడ ఏం చేస్తున్నావ్ రా గుడికి వెళ్లే టైం అయింది కదా ఇంక నువ్వు రాలేదేంటి అని భద్రావతి అడుగుతుంది.. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటి అన్నయ్య నువ్వు ఇంకా గుడికి వెళ్ళలేదు అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు కదా వెళ్ళు అని అనగానే నేను వెళ్ళను వాడు ధీరజ్ ఎన్నో మాటలు అన్నాడు. వాన్ని చూడగానే నువ్వు ఒళ్ళో పడిపోతావట.. వాడు ఎలాగైనా సరే నిన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాను అని నాతో చాలెంజ్ చేశాడు. ఒకవేళ నువ్వు వాడితో పడిపోతావ్ అని గుడికి రాకపోయినా రాకపోవచ్చు అని అన్నాడు. అందుకే నేను వెళ్ళను అని ప్రేమతో అంటాడు విశ్వం. అంత మాట అన్నాడా నేను కూడా గుడికి వస్తాను వాడి ఒళ్ళు నేను ఎలా పడతానో చూస్తాను అని విశ్వం చెప్తాడు. ప్రేమా మాట అనగానే కచ్చితంగా గుడికి వస్తుంది అని ఫిక్స్ అవుతాడు. ప్రేమ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని తన ప్లాన్ సక్సెస్ అయిందని అనుకుంటాడు.. భద్ర పిలవగానే అన్నయ్యతో పాటు నేను కూడా వస్తాను అత్తా అని ప్రేమ అంటుంది.
ప్రేమ అన్నమాట విన్నా భద్రావతి ఏంటి నువ్వు కూడా వస్తావా నేను అసలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది.. అసలు నువ్వు రానని అన్నావు కదా ఏదో క్లాసు ఉందని చెప్పావు కదా.. మళ్ళీ ఇప్పుడు వస్తానని అంటున్నావ్ ఏంటి అని అనగానే లేదు అత్త నేను కూడా వస్తాను అని ప్రేమ మొండిగా అంటుంది. ఆ మాట వినగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. ప్రేమ మనసు మారిపోతుంది అని భద్రావతి కూడా చాలా సంతోషంగా ఉంటుంది… ఇద్దరూ కూడా గుడికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు.. ప్రేమ వస్తుంది అని తెలియగానే విశ్వం ధీరజ్ ప్రేమను కలిపేసి అమూల్యతో నా ప్రేమని కనెక్ట్ చేసుకుంటాను అని అనుకుంటాడు..
ఇక అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. రామరాజు కుటుంబం ఇటు సేన కుటుంబం ఇద్దరు కూడా ఎదుర్పడడంతో ఎవరికి వారే అన్నట్టు వెళ్తూ ఉంటే.. సేన రామరాజు కుటుంబాన్ని ఘోరంగా అవమానిస్తాడు . గుడికి ఎందుకు వచ్చారు ఎవరితో అయినా దొంగ పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవాలనుకుంటున్నారా.? డబ్బున్న వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కదా మీ పని అని దారుణంగా మాట్లాడడంతో ముగ్గురు అన్నదమ్ములు సీరియస్ అవుతారు. మాట్లాడుతున్నావ్ రా అని అనగానే రామరాజు ఆగండి రా.. గుడికి వచ్చింది మనము దేవుడు దర్శనం కోసం ఇలాంటి మాటలు పట్టించుకోవడం అవసరమా అని అనగానే వాళ్లంతా సైలెంట్ అయిపోతారు.. ఇక ప్రేమ ధీరజ్ పక్కన నడుస్తూ ఉండగా విశ్వం ప్రేమని ధీరజ్ మీద పడేలా చేస్తాడు. అయితే ప్రేమను పట్టుకున్న ధీరజ్ ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు.. మొగుడిని పక్కన పెట్టుకొని ఉండలేకపోతుందేమో అని నర్మదా అనడంతో అదేమీ లేదు కానీ ప్రేమ అంటుంది. పొరపాటున కాలు జారి కింద పడ్డాను అని చెప్పగానే సరే అని భద్రావతి కూడా అంటుంది. ఇదంతా విశ్వం ప్లాన్ అని తెలిసి అమూల్య స్మైల్ ఇస్తుంది.
భద్రావతి వెళ్తుండగా శ్రీవల్లి కూడా ముందుగా వెళ్లి తన మీద పడిపోయినట్లు నటిస్తుంది. ఇక ఏమైందే నా మీద పడ్డావు అని శ్రీవల్లింతో భద్రావతి అరుస్తుంది.. శ్రీవల్లి మాట విన్న భద్రావతి నీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బయటికి వెళ్దాం రండి అని తీసుకొని వెళ్ళిపోతుంది.. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ గుడికి వచ్చింది ప్రసాదాలు తిని పట్టు చీర పెట్టి వెళ్లడానికి కాదు ప్రేమని ధీరజ్ని కలపడానికి మీరు ఆ ప్లాన్ ని అర్థం చేసుకుని వాళ్ళిద్దర్నీ కలవకుండా చేయాలి అని అనడంతో భద్రవది కాస్త టెన్షన్ పడినా కూడా వల్లి ఏం చెప్తే అదే చేయాలి అని అనుకుంటుంది.. ప్రేమతో ఎవ్వరిని మాట్లాడనివ్వకుండా చేయాలి అని అనుకుంటారు. వల్లి ప్లాను మరి సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.
గుడిలోకి వెళ్లిన తర్వాత అందరూ అర్చన చేయించుకోవాలని అమ్మవారికి తెచ్చిన చీరని సమర్పించాలని అనుకుంటారు.. అయితే ఇద్దరూ కలిసి అమ్మవారికి చీరని సమర్పిస్తారు.. పంతులతో అనడంతో రెండు చేరల్ని ఒకేసారి తీసుకుంటాను అని ఆయన అంటారు. పనోడు దగ్గర చీర మీరు తీసుకుంటే మాకు అవమానమని ఇద్దరు కాసేపు గొడవపడతారు.. సేన రామరాజుల మధ్య పోటీ మాత్రం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు అని మిగిలిన వాళ్ళందరూ ఎదురుచూస్తూ ఉంటారు.. మొత్తానికి గుడిలో పూజ కోసం వచ్చిన వాళ్ళని అర్చన కోసం పూజారి అడుగుతాడు.. మాత్రం తన భర్త పేరు చెప్పడానికి ఇష్టపడదు. తో ప్రేమ కోపం ఇంకా తగ్గలేదు అని అనుకుంటారు. భర్తకి అయీష్టమని చెప్పిన సరే ప్రేమ తన పేరు చెప్పడానికి ఇష్టపడకపోవడంతో భద్ర ప్రేమ మనిషి అనే అనుకుంటుంది.
ప్రేమ అర్చన చేయించడానికి కూడా తన పేరు చెప్పడానికి ఇష్టపడకపోవడంతో ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తుంది ప్రేమ అని ఆలోచిస్తూ ఉంటాడు.. నువ్వంటే నాకు ఎంత ప్రేమ తెలుసు కదా.. నేనంటే కూడా నీకు అంతే ప్రేమ కదా మరి ఎందుకు నువ్వు నా పేరు కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధీరజ్.. ప్రేమ కూడా ధీరజ్ పై ఇలా మాట్లాడడం బాగోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ధీరజ్ ఒకతను పడిపోతూ ఉంటే అతని పట్టుకుంటాడు అప్పుడే అక్కడేసిన పందిరి ధీరజ్ మీద పడిపోతుంది. అది చూసిన ప్రేమ ధీరజ్ కి ఏమన్నా అయిందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది.. తనకి దెబ్బ తగిలింది అని వేదవతి అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..