BigTV English

AvinashReddy: భాస్కర్‌రెడ్డికి రిమాండ్.. అవినాశ్‌రెడ్డికి షాక్.. సీబీఐపై అటాక్..

AvinashReddy: భాస్కర్‌రెడ్డికి రిమాండ్.. అవినాశ్‌రెడ్డికి షాక్.. సీబీఐపై అటాక్..

AvinashReddy: వివేక హత్య కేసు కీలక దశకు చేరింది. ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ పులివెందులలో అరెస్ట్ చేసింది. హైదరాబాద్ తరలించి ఉస్మానియా ఆసుప్రతిలో వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసంలో భాస్కర్‌రెడ్డిని హాజరుపరచగా.. ఈనెల 29 వరకు 14 రిమాండ్ విధించింది కోర్టు. భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


తండ్రి అరెస్టుతో అవినాశ్‌రెడ్డి షాక్. కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ఉదయం అరెస్ట్ జరిగితే సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి అరెస్టును, సీబీఐ దర్యాప్తు తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. వివేకా హత్య కేసులో తన వెర్షన్ వినిపించారు.

అంతా గతంలో చెప్పిన విషయాలే. మళ్లీ అవే గుర్తు చేశారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌ను సీబీఐ ఎందుకు విచారించట్లేదు? హత్యాస్థలంలో దొరికిన లేఖపై దర్యాప్తు ఎందుకు చేయట్లేదు? వివేకా కుటుంబంలో ఆస్థి గొడవల దిశలో ఎందుకు ప్రశ్నించడం లేదు? వివేకా రెండో భార్య గురించి ఎందుకు ఆరా తీయట్లేదు? ఇలా సాగింది అవినాశ్‌రెడ్డి వెర్షన్. సునీత, సీబీఐ ఒక్కటేనని.. తమను టార్గెట్ చేసేలా విచారణ జరుగుతోందని అన్నారు.


కేసు విచారణలో కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోందని.. అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూపిస్తోందని తప్పుబట్టారు. దర్యాప్తు సంస్థ ఈ స్థాయికి దిగజారడం విచారకరమన్నారు. పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వివేకా స్వయంగా రాసిన లేఖను పట్టించుకోవట్లేదని.. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికేనని.. తనకంటే గంటముందుగానే విషయం తెలిసినా ఆయన పోలీసులకు చెప్పలేదన్నారు. వివేకా రాసిన లేఖను, ఫోన్‌ను దాచిపెట్టాలని చెప్పారని.. అయినా.. వివేకా అల్లుడిని సీబీఐ విచారించట్లేదని తప్పుబట్టారు అవినాశ్‌రెడ్డి. తమని కావాలనే దోషులుగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారని ఆరోపించారు.

మహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారని.. వివేకాకు షెహన్‌షా అనే కుమారుడు ఉన్నాడని..రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారని అవినాశ్‌రెడ్డి అన్నారు. వివేకా ఇంట్లో స్టాంప్ పేపర్లు, రౌండ్ సీల్ కూడా లభించాయని.. ఆ దిశగా దర్యాప్తు మాత్రం చేయట్లేదని అవినాశ్‌రెడ్డి విమర్శించారు.

సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయని.. సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని.. తాము ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు అవినాశ్‌రెడ్డి. తన తండ్రి భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారన్నారు.

Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×