BigTV English

YS Jagan Chittoor Tour: రోడ్డుపై మామిడి కాయలు వేసి తొక్కించిన జగన్ దళం.. ఫుడ్ విలువ తెలుసా?

YS Jagan Chittoor Tour: రోడ్డుపై మామిడి కాయలు వేసి తొక్కించిన జగన్ దళం.. ఫుడ్ విలువ తెలుసా?

పంట కోతకు ఇచ్చే కూలీలకు కూడా డబ్బులు సరిపోవంటూ అప్పుడప్పుడు టమోటా మొక్కల్ని ట్రాక్టర్లతో తొక్కించడం చూస్తూనే ఉంటాం. మార్కెట్ కి తీసుకుపోడానికి ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా రాదంటూ తోటల పక్కనే కాయల్ని పారబోయడం కూడా చూస్తుంటాం. కానీ ఒక నాయకుడు పరామర్శకు వస్తున్నాడని తెలిసి, ఆ సన్నివేశం రక్తి కట్టించడం కోసం ట్రాక్టర్లతో తీసుకొచ్చిన మామిడి కాయల్ని రోడ్డుపై పారబోసి తొక్కించడం ఎక్కడైనా చూశామా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అందులోనూ ఆ ట్రాక్టర్లకు వైసీపీ జెండాలు కట్టి మరీ ఈ సీన్ లో రచ్చ చేశారని అంటున్నారు. ఈరోజు జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో ఈ వ్యవహారమే హైలైట్ గా మారింది.


ట్రాక్టర్లతో తొక్కించారు..
రైతుల ఆగ్రహం పెల్లుబికింది, గిట్టుబాటు ధర లేక రైతులే మామిడి కాయల్ని పారబోస్తున్నారు, ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ వీడియోలతో సింపతీ రాదనుకున్నారో ఏమో.. వైసీపీ అధికారిక సోషస్ మీడియా అకౌంట్లలో మాత్రం వాటిని షేర్ చేయలేదు. అయితే టీడీపీ మాత్రం ఇవి వికృత చేష్టలంటూ మండిపడింది. రైతుల పేరుతో వైసీపీ కార్యకర్తల వికృత చేష్టల ఇవేనంటూ ట్రాక్టర్లతో మామిడి పండ్లను తొక్కిస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. బంగారు పాళ్యంలో మామిడి రైతుల పరామర్శ పేరిట చేపట్టిన ఈవెంట్ పాలిటిక్స్ ఇవి అంటూ విమర్శించారు టీడీపీ నేతలు. మార్కెట్ లో అమ్మాల్సిన మామిడి కాయలను తెచ్చి రోడ్డుపై కాన్వాయ్ ముందు పోసి వైసీపీ నేతలు డ్రామా రక్తికట్టించాలని చూశారని చెప్పారు. జగన్ వచ్చే సమయానికి తోటల్లోనుంచి, మామిడి లోడ్ తో ఉన్న ట్రాక్టర్లు బయటతెచ్చి, రోడ్డు పై పారబోశారని, ఆ తోట ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిది అని ఆయన చిత్తూరు నగర వైసీపీ సెక్రటరీ అని, మామిడి పండ్లను తెచ్చిన ట్రాక్టర్లు వైసీపీ నేత శేఖర్ రెడ్డివి అని టీడీపీ అంటోంది. రైతులు కష్టపడి పండించిన పంటని, ట్రాక్టర్ కి వైసీపీ జెండాలు కట్టుకుని, రోడ్డు పై పారబోస్తూ, వాటిని టైర్లతో తొక్కిస్తూ, కాళ్లతో తొక్కుతూ, డ్యాన్సులు వేస్తున్నారని, వారిని ఉన్మాదులు అనక ఇంకేమనాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉన్మాద వికృత చేష్టలు చూసి, జగన్ నవ్వుకుంటూ ఆనంద పడుతున్నారని విమర్శించారు.

రైతులపై దండయాత్ర..
జగన్ చేసేది రైతులకు ఓదార్పు యాత్ర కాదని, ఆపేరుతో వారిపై దండయాత్ర చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా కౌంటర్లిచ్చింది. మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి బస్తాలు దొంగతనం చేశారని, పొగాకు రైతుల పరామర్శ పేరుతో పొగాకు బేళ్ల ధ్వంసం చేశారని, ఇప్పుడు మామిడి రైతుల పరామర్శ పేరుతో మామిడి పంట నాశనం చేశారని అంటున్నారు. జగన్ మెప్పు కోసం మామిడి పంటను రోడ్డు మీద పారబోయాలని ఒకరోజు ముందే వైసీపీ నేతలు ప్లాన్ చేశారని టీడీపీ కొన్ని ఆధారాలను బయటపెట్టింది.

మొత్తమ్మీద ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మామిడి పండ్లకు మార్కెట్ లో మంచి రేటే ఉంది. ఒకవేళ మామిడి రసం తీసే ఫ్యాక్టరీలు కొనుగోలు చేయకపోయినా మార్కెట్లో వాటిని అసలు రేటుకైనా అమ్ముకునే అవకాశం ఉంది. కానీ ఇలా పారబోసి, ట్రాక్టర్లతో తొక్కిస్తే ఏమొస్తుంది..? అసలు వాటి విలువ తెలిసినవారు ఇలాంటి పనులు చేస్తారా..? అనే విమర్శలు వినపడుతున్నాయి. ఆహారాన్ని, అందులోనూ మామిడిలాంటి అమృత ఫలాలను ట్రాక్టర్లతో తొక్కించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

సెటైర్లు..
మరికొంతమంది మామిడి పంటను నాశనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలైన రైతులకు ఆ పంట విలువ తెలుసని, కానీ అక్కడ షో చేయడానికి వచ్చినవారు కేవలం రాజకీయ స్వలాభం కోసం ఆ పంటను పారబోసి, ట్రాక్టర్లతో తొక్కించారని అంటున్నారు. ఇలాంటి డ్రామాలను నిజమైన రైతులు గుర్తించాలంటున్నారు.

Related News

AP News: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ యాక్టివ్.. సుగాలి ప్రీతి కేసు కూడా

Srikakulam News: లవ్ మ్యారేజీకి ఒప్పుకోవడం లేదని.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్.. చివరకు?

YSR CSO John Wesley: కొడుకు వర్ధంతి.. తల్లి అదే రోజు మృతి.. ఈ ఫ్యామిలీకి జగన్ కు సంబంధమేంటి?

Nellore Politics: కాకాణితో భేటీ.. నెల్లూరు నగర మేయర్ స్రవంతికి పదవీగండం

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Big Stories

×