Homemade Rose Gel: చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే.. సహజ పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో రోజ్ జెల్ (Rose Gel) అద్భుతంగా పనిచేస్తుంది. గులాబీ రేకులతో తయారైన ఈ జెల్ చర్మానికి తాజాదనాన్ని, మృదుత్వాన్ని ఇవ్వడంతో పాటు.. ఎలాంటి స్కిన్ వారికైనా అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఉపయోగించుకునే ఈ నేచురల్ బ్యూటీ టిప్స్ ఒకసారి ట్రై చేశారంటే.. కొరియన్ లాంటి చర్మం మీ సొంతం అవుతుంది. చర్మంపై నలుపుదనం తగ్గించి.. తెల్లగా, గ్లాసీ లుక్‌లో కనిపిస్తుంది. అలాగే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిస్తాయి. చర్మం నిత్యం తాజాగా కనిపించడంలో సహాయపడుతుంది.
కావాల్సిన పదార్దాలు
గులాబీ పువ్వులు
రైస్ వాటర్
విటమిన్ ఇ క్యాప్సూల్స్
అలోవెరాజెల్
తయారు చేసుకునే విధానం
ముందుగా ఫ్రెష్ గులాబీ పువ్వులను తీసుకుని.. నీటితో శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొంచెం రాస్ వాటర్ కలిపి.. గ్యాస్‌పై 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ వాటర్‌ను వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ అలోవెరాజెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా కలపండి. క్రీమ్ లాగా తయారు అవుతుంది. దీన్ని గాజు కంటైనర్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖం శుభ్రం చేసుకుని, ఫేస్‌పై రోజ్ జెల్ అప్లై చేసి మసాజ్ చేయండి. రాత్రంతా ఉండనివ్వండి. ఉదయం ఫ్రెష్ వాష్‌తో ముఖం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఫేస్ ప్యాక్‌ల్లో ఒక టీస్పూన్ రోజ్ జెల్ కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్‌గా చేయడం ద్వారా.. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. కొరియన్ మాదిరిగా మీ చర్మం కూడా మిలమిల మెరిసిపోతుంది. కొద్దిరోజుల్లోనే తెల్లగా కనిపిస్తారు.
రోజ్ జెల్ ప్రయోజనాలు:
చర్మానికి తాజాదనం:
రోజ్ జెల్‌ను ముఖానికి రాసిన వెంటనే చర్మం తాజాగా, ఫ్రెష్‌గా మారుతుంది. వర్షాకాలంలో ఈ టిప్స్ చక్కగా పనిచేస్తుంది.
సహజ మాయిశ్చరైజర్:
చర్మం పొడిబారినప్పుడు, రోజ్ జెల్ సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
మొటిమలు, మచ్చలకు చెక్:
రోజ్ జెల్‌లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మురికిని, బాక్టీరియాలను తొలగించి, మొటిమలను, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.
ఏజింగ్ లైన్‌లు, ముడతలపై ప్రభావం:
యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండిన రోజ్ జెల్.. చర్మంపై ముడతలను తగ్గించడంతోపాటు, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది కూడా.
సాధారణ చర్మ సంరక్షణలో రోజ్ జెల్‌ను చేర్చితే.. మీ స్కిన్ కాంతివంతంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా బయట మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ వల్ల.. అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి కాబట్టి, సహజంగా అందాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారికీ ఇది బెస్ట్ ఆప్షన్. ఈ రోజు నుంచే ట్రై చేయండి.. మీ లుక్ ఎవర్ గ్రీన్‌గా మెరిసిపోతుంది!
Also Read: మొండి మొటిమలను తగ్గించే ద్రవం ఇదే, రెండు వారాల్లో మొటిమలు పోతాయి
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.