Fake Flight Attendant Scam: టిరాన్ అలెగ్జాండర్. ఫ్లోరిడాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి. ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేయాలనేది ఇతడి కోరిక. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. సంవత్సరాలుగా విమాన సంస్థలను మోసం చేస్తూ ఉచిత ప్రయాణాలు చేశాడు. అధికారులు దర్యాప్తు ఏకంగా 120 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేసినట్ల తేలింది. ఒకటి, రెండు సార్లు అంటే ఓకే, అన్నిసార్లు అలా ఎలా చేశాడని అందరూ పరేషాన్ అయ్యారు. ఇంతకీ ఆయన ఉచిత ప్రయాణం కోసం చెప్పిన సాకు ఏంటో తెలుసా?
2018 నుంచి ఉచిత విమాన ప్రయాణాలు
టిరాన్ 2018 నుంచి ఉచిత ప్రయాణాలు చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం అతడు ఎంచుకున్న మార్గం విమాన సహాయకుడిలా యాక్ట్ చేయడం. అతడు విమానయాన కార్మికులను మోసం చేయడానికి నకిలీ బ్యాడ్జ్ నంబర్లు, నకిలీ నియామక తేదీలను యూజ్ చేసుకున్నాడు. వీటి ద్వారా అతడు ఉచిత విమానా ప్రయాణాలను బుక్ చేసుకున్నాడు. అమెరికన్, డెల్టా, యునైటెడ్, స్పిరిట్ లాంటి పెద్ద విమానయాన సంస్థలలో 120 కంటే ఎక్కువ ఉచిత ప్రయాణాలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
అంత ఈజీగా ఎలా మోసం చేశాడు?
విమానయాన సంస్థలు వారి సిబ్బంది కోసం ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉంది. ఖాళీ సీట్లు ఉంటే విమాన సహాయకులు, పైలట్లు ఉచిత లేదంటే చౌకగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టిరాన్ ఈ వ్యవస్థను బేస్ చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు 30 నకిలీ బ్యాడ్జ్ నంబర్లను క్రియేట్ చేసుకున్నాడు. విమానాశ్రయ సిబ్బందిని ఈజీగా నమ్మించాడు. అత్యధికంగా ఓ విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్స్ లో 34 సార్లు ప్రయాణించినట్లు దర్యాప్తులో తేలింది.
టిరాన్ ఎలా పట్టుబడ్డాడు?
టిరాన్ 2018 నుంచి 2024 వరకు ఉచిత ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 2024లో అతడిని అరెస్టు చేశారు. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) అతడి మాయ మాటలపై అనుమానం కలిగి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.
దోషిగా తేల్చిన న్యాయస్థానం
అరెస్టు తర్వాత టిరాన్ ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. జూన్ 2025న మయామిలోని ఒక కోర్టు టిరాన్‌ను దోషిగా తేల్చింది.అతడు రెండు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఉచిత విమానాలను పొందడానికి అబద్ధం చెప్పడం, విమానాశ్రయాలలో ఫ్లైట్ సిబ్బంది మాత్రమే వెళ్లాల్సిన ప్రదేశాలలోకి వెళ్లడం లాంటి నేరాలల్లో దోషిగా వెల్లడించింది. అబద్దాలు చెప్పి టికెట్లు బుక్ చేసుకున్నందు 20 సంవత్సరాలు, విమానంలో సురక్షిత ప్రాతంలోకి అడుగు పెట్టినందుకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అతడికి ఆగస్టు 25, 2025న శిక్ష విధించనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
బయటపడ్డ భద్రతా లోపాలు
టిరాన్ స్కామ్ విమానాశ్రయ భద్రతలో లోపాలను ఎత్తి చూపించింది. విమానయాన సంస్థలు అతడి నకిలీ బ్యాడ్జ్ లను చాలా సులభంగా విశ్వసించాయి. మళ్ళీ ఇలా జరగకుండా నిరోధించడానికి వారు తమ నియమాలను మార్చుకునే అవకాశం ఉంది.
Reada Also: బీచ్ లో ఎప్పుడైనా కెరటాలు ఇలా కనిపిస్తే.. అస్సలు దిగొద్దు.. ఎందుకంటే?