E-Paper
Advertisement

కొత్త బట్టలు కొనకుండానే ట్రెండీ లుక్స్ ట్రై చేయొచ్చు.. మెటా తెచ్చిన ఈ యాప్ ఏంటో తెలుసా?

కొత్త బట్టలు కొనకుండానే ట్రెండీ లుక్స్ ట్రై చేయొచ్చు.. మెటా తెచ్చిన ఈ యాప్ ఏంటో తెలుసా?
Advertisement

Meta Style Sketch: ప్రతిరోజూ ఏ బట్టలు వేసుకోవాలి? ఏ డ్రెస్‌కు ఏ షూస్ సరిపోతాయి? బయటకు వెళ్లేటప్పుడు కొత్తగా ఎలా కనిపించాలి? ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఇప్పుడు వీటికి పరిష్కారం చూపించేలా మెటా కొత్త AI ఫ్యాషన్ యాప్ Style Sketchను తీసుకొచ్చింది. మన దగ్గర ఇప్పటికే ఉన్న బట్టల ఫొటోలతో డిజిటల్ వార్డ్‌రోబ్ తయారు చేసి, వాటితో కొత్త కొత్త లుక్స్‌ను సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానమైన ఈ యాప్ ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

బట్టలతో డిజిటల్ వార్డ్‌రోబ్:

Style Sketch యాప్ మన దగ్గర ఉన్న బట్టలను డిజిటల్ రూపంలో చూపిస్తుంది. దీనికోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని ఫొటోలు, ఫోన్ కెమెరా రోల్‌లోని చిత్రాలను ఉపయోగించవచ్చు. కావాలంటే ఒక్కో వస్త్రం ఫొటో తీసి, వీడియో అప్‌లోడ్ చేసి లేదా గ్యాలరీ నుంచి చిత్రాలను ఎంచుకుని కూడా జోడించవచ్చు. ఇలా వార్డ్‌రోబ్ సిద్ధమైన తర్వాత, మన దగ్గర ఉన్న దుస్తులతో ఎలాంటి కాంబినేషన్లు బాగుంటాయో యాప్ సూచిస్తుంది.

వేసుకోకుండానే కొత్త లుక్:

Advertisement

ఈ యాప్‌లో నచ్చిన డ్రెస్‌ను నిజంగా వేసుకోకముందే అది ఎలా కనిపిస్తుందో చూసే అవకాశం ఉంది. మన శరీర ఆకృతి, చర్మ రంగుకు సరిపోయే వర్చువల్ మోడల్‌పై దుస్తులను చూపిస్తుంది. ఎక్కువగా వాడని జాకెట్, షూస్ వంటి వస్తువులను కూడా కొత్తగా ఎలా ఉపయోగించాలో సూచిస్తుంది. దీంతో కొత్త బట్టలు కొనకుండానే మన దగ్గరున్న వాటితో విభిన్నమైన లుక్స్ ప్రయత్నించవచ్చు.

Also Read: వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!

ట్రిప్‌కు తగ్గట్టుగా సూచనలు:

Advertisement

ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఏ బట్టలు తీసుకెళ్లాలనే విషయంలోనూ Style Sketch ఉపయోగపడుతుంది. వెళ్లే ప్రాంతం, అక్కడి వాతావరణం, ప్రయాణం ఎన్ని రోజులు ఉంటుందనే వివరాలను బట్టి దుస్తులను సూచిస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్‌లో ఉన్న ట్రెండ్స్‌ను చూసి, అలాంటి లుక్‌ను మన దగ్గరున్న బట్టలతో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. నచ్చిన రెండు అవుట్‌ఫిట్స్‌ను స్నేహితులకు పంపి వారి అభిప్రాయం కూడా అడగవచ్చు.

ఎక్కడ అందుబాటులో ఉంది?

Style Sketch ప్రస్తుతం ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై మెటా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఇలాంటి ఫ్యాషన్ సేవలు అందిస్తున్న Alta వంటి యాప్‌లకు ఇది పోటీగా మారే అవకాశం ఉంది. ఫ్యాషన్ ట్రెండ్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే వారికి ఈ యాప్ మరింత ఉపయోగకరంగా మారవచ్చు. అయితే, భారతీయ యూజర్లు దీన్ని ఎప్పటి నుంచి ఉపయోగించగలరో చూడాలి.

Also Read: ఐఫోన్ డ్యూయో స్క్రీన్ క్రాక్ సమస్య.. సర్వీస్ సెంటర్లకు యాపిల్ చేసిన ఆదేశాలివే!

Tags

Related News

టెక్ ప్రపంచంలో ఊహకందని అద్భుతం.. శాంసంగ్ నుంచి 17 ఇంచుల ట్యాబ్లెట్, జేబులో పట్టేస్తుంది!

అమెజాన్ సేల్..బెస్ట్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లపై అదిరిపోయే ఆఫర్లు!

లేటెస్ట్ ఫీచర్లతో అదిరిపోయే 32 ఇంచుల టీవీలు..ధర కూడా చాలా తక్కువ

వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!

విండోస్ 11లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? ఈ 7 ట్రిక్స్ మీకు తెలుసా?

ఐఫోన్ డ్యూయో స్క్రీన్ క్రాక్ సమస్య.. సర్వీస్ సెంటర్లకు యాపిల్ చేసిన ఆదేశాలివే!

మీ వంటను ఈజీ చేసే..బెస్ట్ 5 స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లు!

Big Stories

Advertisement
×