BigTV English

YS Jagan: ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు.. డీజీపీకి మాజీ సీఎం జగన్ హెచ్చరిక

YS Jagan: ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు.. డీజీపీకి మాజీ సీఎం జగన్ హెచ్చరిక

YS Jagan Comments: ఏపీలో కూటమి పాలనలో అంతా చీకటి రోజులేనంటూ మాజీ సీఎం జగన్ అన్నారు. తాళ్లాయపాలెం సభలో సీఎం చంద్రబాబు, సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది క్షణాలకే మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే తమ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. విద్య వద్దు.. మద్యం ముద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కూడా పోలీసులు ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.


ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారి పోయిందని, కేవలం 5 నెలల్లో 91 మంది మహిళలపై అత్యాచార యత్నాలు, ఘటనలు జరిగాయని, ప్రభుత్వం ఏం చేస్తుందంటూ జగన్ ప్రశ్నించారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అత్యాచార ఘటన జరిగినా కూడా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం ఉందన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, కానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేసిన సమయంలో 41ఏ నోటీస్ ను జారీ చేయాలని, అర్ధరాత్రి వెళ్లి ఎలా అరెస్టుల పర్వానికి తెర తీశారని ప్రశ్నించారు. ఏడేళ్ల లోబడి శిక్షలు ఖరారయ్యే కేసులకు నోటీసులను జారీ చేయాలన్న విషయం కూడా తెలియకుండా అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నట్లు జగన్ విమర్శించారు. ఈ అరెస్ట్ ల సమయంలో వారి కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, టీడీపీ సానుభూతిపరులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ఒత్తిడి తెచ్చి డీజీపీ ద్వారా అక్రమ కేసులకు తెర తీశారన్నారు.


తల్లిని చంపడానికి తాను ప్రయత్నించినట్లు టీడీపీ సోషల్ మీడియా కోడై కూసిందని, ఏకంగా తన తల్లి విజయమ్మ రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకొనే స్థాయికి తీసుకువచ్చారన్నారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ సోషల్ మీడియాపై కేసు నమోదు చేసి, లోకేష్ ను డీజీపీ అరెస్ట్ చేయాలన్నారు. అయ్యా డీజీపీ గారూ.. సెల్యూట్ కొట్టాల్సింది మూడు సింహాలకు గానీ, అక్రమ కేసులు పెట్టించే వారికి కాదన్నారు. పోలీసుల అఘాయిత్యాలు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం ఈరోజు మారి ఉండవచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాం.. చట్టాన్ని రక్షించండి కానీ, ఇలా అక్రమ కేసులు బనాయించి పోలీస్ ప్రతిష్టను దిగజార్చావద్దంటూ జగన్ కోరారు.

Also Read: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. ఆ గ్రామానికి ఏంటి సంబంధం.. అసలు కథ ఇదే!

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను గాలికి వదిలి ఏకంగా సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై మీ సత్తా చూపిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైద్యశాలల్లో మందులు లేవు, సూపర్ సిక్స్ లు లేవు, సూపర్ సెవెన్ లు లేవని, అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×