Galaxy S25 Slim Model : ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ మెుబైల్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్.. మరో కొత్త మోడల్ ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. Galaxy S25 లైనప్ (Galaxy S25 lineup) లో గెలాక్సీ S25 స్లిమ్ పేరుతో మూడు మోడల్స్ ను తీసుకురానుందన్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త మెుబైల్స్ అధునాతన ఫీచర్స్ తో రాబోతున్నాయని… వినియోగదారులను మరింత ఆకట్టుకుంటాయని కొరియాకు చెందిన ప్రముఖ ఛానెల్ ET న్యూస్ తెలిపింది. ఈ మోడల్ మెుబైల్స్ 2025లో మార్కెట్లోకి రాబోతున్నట్లు చెప్పుకొచ్చింది.
Galaxy S25 లైనప్ లో Galaxy S25 Slim మోడల్ మెుబైల్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా మెుబైల్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ మెుబైల్స్ అన్నీ US వెర్షన్‌తో మోడల్ నంబర్ SM-S937 ప్రాసెసర్ కింద పనిచేయనున్నాయి. నిజానికి Galaxy S25 Slim మోడల్ కోడ్ అయిన GSMA అనేది IMEI డేటాబేస్ లో కనిపించటంతో రూమర్స్ ఊపందుకున్నాయి. Samsung ఏ మెుబైల్స్ ను లాంఛ్ చేసినా సాధారణంగా 6 నెలల ముందే GSMAలో రిజిష్టర్ అవుతాయి. దీంతో ఈ మోడల్స్ ఏప్రిల్ లేదా మే 2025 విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ : ఇచ్చిపడేసిన అమెజాన్.. తాజాగా లాంఛ్ అయిన ఫోన్ పై ఏకంగా రూ.45వేల డిస్కౌంట్
సామ్ సాంగ్ గేలక్సీ స్లిమ్ మెుబైల్స్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఇందులో కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనుంది. హై క్వాలిటీ ఇమేజెస్ ను ఇచ్చే 200MP కెమెరా ఇందులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక Galaxy S25 అల్ట్రాలో 200MP మెుయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో సూపర్ టెలిఫోటో కెమెరా ఉండనున్నట్లు తెలుస్తుంది. Galaxy S25 స్లిమ్ 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాతో రాబోతుందని.. ఇక Galaxy S25+ మెుబైల్ లో ఉన్నట్లే 200MP కెమెరా ఉండనుంది. S25 స్లిమ్ లో ఫ్రంట్ కెమెరా మిగిలిన సామ్ సాంగ్ మోడల్స్ లో ఉన్నట్లే 12MP కెమెరా ఉండనుంది.
ఈ మోడల్ మొబైల్స్ లో స్టోరేజ్ తో పాటు ప్రాసెసర్, డిస్ ప్లే సైతం హై క్వాలిటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. సామ్ సాంగ్ ఏ సిరీస్ మెుబైల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో ఇందులో ఉన్నట్లే 5000mah బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంతకుముందు మోడల్స్ లో వచ్చినట్టే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో ఈ మెుబైల్స్ రాబోతున్నాయని.. 16 GB + 512 GB స్టోరీజ్ సదుపాయం ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు ఇప్పటికే అంచనా వేసేస్తున్నాయి. ఇక ఈ మెుబైల్స్ కు సంబంధించిన మరిన్ని ఫీచర్స్ తో పాటు ధర సైతం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.