EPAPER

Rakul Preet Singh: సౌత్‌లో ఇంకా అదే పాత పద్ధతి, అలా చేయడం వెర్రితనం.. యంగ్ యాక్టర్లకు రకుల్ సలహా

Rakul Preet Singh: సౌత్‌లో ఇంకా అదే పాత పద్ధతి, అలా చేయడం వెర్రితనం.. యంగ్ యాక్టర్లకు రకుల్ సలహా

Rakul Preet Singh: తెలుగులో హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక సౌత్‌కు, బాలీవుడ్‌కు మధ్య ఉన్న తేడాలు చూసిన తర్వాత ఈ రెండు ఇండస్ట్రీలను పోలుస్తూ షాకింగ్ స్టేట్‌మేంట్స్ ఇచ్చేవారిలో రకుల్ కూడా యాడ్ అయ్యింది. ముఖ్యంగా బాలీవుడ్‌కు సంబంధించిన పలు విషయాలను ఓపెన్‌గా చెప్పడానికి కొందరు హీరోయిన్లు ముందుకొస్తుంటారు. రకుల్ కూడా అప్పుడప్పుడు అలాంటి విషయాలతో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మరోసారి సినీ పరిశ్రమలో స్ట్రాంగ్‌గా ఉండడం ఎంత ముఖ్యం అనే విషయంపై మాట్లాడింది ఈ భామ.


ఆ స్టేట్‌మెంట్ ఒప్పుకుంటాను

బాలీవుడ్‌లో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రోహిత్ శెట్టి కూడా ఒకడు. పైగా ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి మ్యానేజ్ చేస్తూ మల్టీ స్టారర్ తెరకెక్కించడంలో తను దిట్ట అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇటీవల తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో యంగ్ హీరోలపై ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాజాగా ఆ స్టేట్‌మెంట్‌పై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. రోహిత్ శెట్టి చెప్పిన మాటల్లో నిజం ఉందని ఒప్పుకుంది. అంతే కాకుండా అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటీనటులకు చాలామంది సలహాలు ఇస్తుంటారని, కానీ ఏది ఎలా చేయాలి అనే క్లారిటీ వారికి ఉండడం ముఖ్యం అని చెప్పకనే చెప్పింది ఈ భామ.


Also Read: విజయ్ దళపతి ఆఖరి సినిమాలో బుట్టబొమ్మ కు ఛాన్స్?

సౌత్‌లో అలా కాదు

‘‘విన్న ప్రతీ విషయాన్ని నమ్మడం వెర్రితనం. చాలామంది చాలారకాలుగా సలహాలు ఇస్తుంటారు. కానీ ఎవరి బుర్ర వారు వాడాలి. రోహిత్ చెప్పింది వంతశాతం నిజం. సౌత్‌లో సింగిల్ మ్యానేజర్‌తో కాలం గడిపే పాత పద్ధతి ఇంకా నడుస్తోంది. వాళ్లకు పెద్ద టీమ్ ఏమీ ఉండదు. మీ చుట్టూ పదిమంది చేరి మీకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పడం అక్కడ జరగదు’’ అంటూ సౌత్‌తో బాలీవుడ్‌ను పోల్చింది రకుల్ ప్రీత్ సింగ్. ‘‘ఇతరులు చెప్పేది వినడం, గౌరవించడం మంచిదే. వాళ్లకు తెలిసింది వాళ్లు చెప్తారు. కానీ నీకు కరెక్ట్ అనిపించింది చేయడమే ముఖ్యం. ఒక యాక్టర్‌గా మీ ప్రవర్తనను పబ్లిక్ చూస్తారు. మీ ప్రవర్తనకు మీరే బాధ్యులు’’ అని తెలిపింది.

అదంతా వద్దు

‘‘మీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు అనేది కూడా ముఖ్యమే. యాక్టర్లు ఎక్కువగా హెయిర్, మేకప్ టీమ్, స్పాట్ బాయ్స్‌తో సమయాన్ని గడుపుతారు. కాబట్టి వారు ఎలాంటివారు అని తెలుసుకోవాలి. ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు అస్సలు లేదు’’ అని చెప్పుకొచ్చింది రకుల్. బాలీవుడ్‌లో తన మొదటి రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘‘ప్రమోషన్స్ సమయంలో స్టైలిస్ట్‌ను తీసుకురావాలని నాకు తెలియదు. ప్రమోషన్స్‌కు ముందే నాకు అది తెలిసింది కానీ అలా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నాను. ఇది జరిగి 12 ఏళ్లు అయ్యింది. స్టైలిస్ట్స్ అనేవాళ్లు చాలా డిమాండ్ చేస్తారు. ఒక్క ఈవెంట్‌కు డ్రెస్ డిజైన్ చేయడం కోసం ఒక్కొక్కరు రూ.15 వేల నుండి రూ.1 లక్ష వరకు తీసుకుంటారు. ఇలాంటివాటి వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు’’ అని రకుల్ ప్రీత్ సింగ్ బయటపెట్టింది.

Related News

Viswam: నిండా ముంచేసిన గోపీచంద్ విశ్వం.. బయ్యర్స్ కి భారీ నష్టం..!

Sri Vishnu : “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్స్ న్యాయపోరాటం… రెండేళ్లు దాటినా పట్టించుకోని ప్రొడ్యూసర్

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Big Stories

×