Mumbai actress kadambari case: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తు జోరందుకుంది. ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత తొలి విడతగా ఇద్దరు పోలీసుల అధికారులపై వేటు పడింది. రెండో విడతలో మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసుల వికెట్లు పడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు మొదలై ఇప్పటికి 20 రోజులు గడుస్తోంది. ఒకవైపు డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ, మరోవైపు స్పెషల్ అధికారి విచారణ, ఈ రెండింటితో లభించిన ఆధారాలతో తొలుత ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.
ఒకరు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు, మరొకరు ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు. రెండో విడతలో మరో ముగ్గురు అధికారు లున్నారు. చివరి స్టేజ్‌లో నలుగురు ఐపీఎస్‌లపై కొరడా ఝులిపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారం నటి కాదంబరి జెత్వానీ.. తల్లిదండ్రులు, న్యాయవాదితో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు వచ్చింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిమిషాల వ్యవధిలో ఆయా అధికారులపై కొరడా ఝులిపించారు పోలీస్ బాస్. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తెలుస్తోంది.
ALSO READ: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ
ఈ వ్యవహారంపై మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఓ ఎస్‌ఐ రోల్ ఉన్నట్లు అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. త్వరలో వారిపై వేటు పడే ఛాన్స్ ఉందట. నటి విజయవాడలో ఉండగానే ఏసీపీ స్థాయి అధికారిపై వేటు పడడంతో కీలక అధికారులకు టెన్షన్ మొదలైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ అధికారులు కొద్దిరోజులుగా డీజీపీ ఆఫీసుకు రాలేదని వార్తలు వస్తున్నాయి.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ని ప్రభుత్వం నియమించింది. ముంబై నుంచి విజయవాడ వచ్చింది నటి జెత్వానీ. రెండురోజులపాటు అక్కడే మకాం వేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి సీపీతోపాటు విచారణ అధికారికి వివరించింది.
ఆమె ఫిర్యాదు స్పీకరించిన పోలీసులు, నటి చెప్పిన మాటలను రికార్డు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, ఆదేశాలతో విజయవాడ కమిషనర్ కాంతిరానా, డీసీపీ విశాల్ గున్నీలు తనపై ఇబ్రహీంపట్నంలో అక్రమంగా కేసు బనాయించారని వాంగూల్మంలో పేర్కొంది.
అధికారులను విచారించే క్రమంలో పోలీసులపై వేటు వేసినట్టు తెలుస్తోంది. వాటికి నోటీసులు విచారించనున్నారు. సేకరించిన వివరాలను దగ్గర పెట్టి సస్పెండ్ అయిన అధికారులను విచారించనున్నట్లు సమాచారం. మొత్తానికి ముంబై నటి కేసులో తీగలాగితే డొంక అంతా కదులుతోందన్నమాట. ఇంకెన్ని పెద్ద తలకాయలు వస్తాయో చూడాలి.
ఇబ్రహీంపట్నం చేరుకున్న ముంబై సినీనటి జత్వనీ.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై సినీ నటి జత్వనీ ఫిర్యాదు.తనను అక్రమంగా బంధించి, చిత్రహింసల గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు.ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ కు ఫిర్యాదు అందజేసిన ముంబై సినీ నటి జత్వనీ.సినీ నటి కేసును ఇప్పటికే… https://t.co/ZXh6Ow5bUx pic.twitter.com/Lmzky6nHHX
— ChotaNews (@ChotaNewsTelugu) September 13, 2024