BigTV English

Pattudala : చేతులెత్తేసిన అనిరుధ్… మ్యూజిక్ విషయంలో ఆ ‘పట్టుదల’ ఏమైంది ?

Pattudala : చేతులెత్తేసిన అనిరుధ్… మ్యూజిక్ విషయంలో ఆ ‘పట్టుదల’ ఏమైంది ?

Pattudala : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). తెలుగులో ఈ మూవీని ‘పట్టుదల’ (Pattudala) అనే టైటిల్ తో ఫిబ్రవరి 6న థియేటర్లలోకి తీసుకొచ్చారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటించగా, లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది. ఇందులో అర్జున్ సర్జా కీలకపాత్రను పోషించారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. కానీ తాజాగా సినిమాను చూసిన మూవీ లవర్స్ అనిరుధ్ బీజీఎంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


‘పట్టుదల’ మూవీ మ్యూజిక్ కు చేతులెత్తేసిన అనిరుధ్

‘పట్టుదల’ (Pattudala) మూవీకి అనిరుధ్ (Anirudh Ravichander) అందించిన మ్యూజిక్ పెద్ద మైనస్ గా మారిపోయిందని కామెంట్స్ విన్పిస్తున్నాయి. నిజానికి అనిరుధ్ ఒక సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అంటే… ఆ సినిమాకు పెద్దగా కథ లేకపోయినా, మ్యూజిక్ తోనే లేపుతాడు అని టాక్ ఉంది. పైగా హీరో ఎలివేషన్ సీన్స్ ను ఆయనిచ్చే బీజీఎంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ తాజాగా రిలీజ్ అయిన ఈ విషయంలో ఆ పట్టుదల ఏమైందో గాని, అజిత్ మూవీకి మాత్రం అనిరుధ్ పూర్తిగా చేతులెత్తేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా అనిరుధ్ తన కెరీర్లో మ్యూజిక్ అందించిన సినిమాలలో ఇదే వరస్ట్ అని, ‘పట్టుదల’కు బ్యాడ్ మ్యూజిక్ అందించాడని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.


సైలెన్స్ కు ఇదే కారణమా ?

ఇకపోతే అనిరుధ్ (Anirudh Ravichander) తాను మ్యూజిక్ అందించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు… తనవంతుగా సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని, ఏదో ఒక కామెంట్ తో రచ్చ రచ్చ చేస్తాడు. ఇక అనిరుధ్ ఫైల్ ఎమోజీ పెట్టాడు అంటే, ఆ మూవీ కచ్చితంగా పేలుతుందనే అర్థం అన్నట్టుగా ఫీల్ అవుతారు మూవీ లవర్స్. అయితే ఆశ్చర్యకరంగా ‘పట్టుదల’  మూవీకి మాత్రం అనిరుధ్ సైలెన్స్ ని మెయింటైన్ చేశారు. దీంతో ఈ మూవీ ప్లాప్ అవుతుంది అన్న విషయం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి ముందే తెలుసా? అందుకే ఇంత సైలెంట్ గా ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అనుకున్నట్టుగానే ‘పట్టుదల’ (Pattudala) మూవీకి నెగిటివ్ టాక్ వస్తుండగా, అందులోనూ అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చెత్తగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. మరి మొదటి రోజే ‘పట్టుదల’ మూవీ మ్యూజిక్ టాక్ ఇలా ఉంటే, అనిరుధ్ చేయబోయే నెక్స్ట్ సినిమాల విషయంలో ఈ ఎఫెక్ట్ పడక తప్పదు. మరోవైపు ‘పట్టుదల’ మూవీ తెలుగులో ఎలాంటి బజ్ లేకుండానే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ ఏమీ చేయకపోవడం మరో మైనస్ గా మారింది. మరి మొదటి రోజు ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×