Turmeric Purity Check: ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటగదిలో పసుపు తప్పకుండా ఉంటుంది. పసుపు ఆహారానికి రంగును ఇవ్వడమే కాకుండా రుచిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ ప్రస్తుతం మార్కెట్ లో దొరికే పసుపును కొని తెచ్చి ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో చాలా వరకు కల్తీ ఉంటుందని మీకు తెలుసా ? అవును కల్తీ పసుపు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా రంగు కోసం పసుపు పౌడర్ లో రసాయనాలు కలుపుతారు. ఇవి క్యాన్సర్‌కు కారణం అవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మార్కెట్ లో లభించే పసుపు కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఒక వేళ కొన్నా కూడా కొన్ని టిప్స్ పాటించి మీరు సులభంగా కల్తీ పసుపును గుర్తించవచ్చు. మరి కల్తీ పసుపును గుర్తించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు స్వచ్ఛతను ఎలా గుర్తించాలి ?
అయోడిన్ పరీక్ష:
పసుపుకు కొన్ని చుక్కల అయోడిన్ కలపండి. పసుపు నీలం రంగులోకి మారితే కల్తీ జరిగిందని గుర్తించండి. స్వచ్ఛమైన పసుపులో అయోడిన్ కలిపితే ఎలాంటి రంగు మార్పు ఉండదు. అయోడిన్ పరీక్షతో పసుపు స్వచ్ఛతను ఈజీగా గుర్తించవచ్చు.
Also Read: కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఈ 3 పనులు చేయండి
వేడి పరీక్ష:
ఒక చెంచా పసుపు పొడిని మంటపై వేసి తక్కువ మంట మీద ఒక పాత్రను ఉంచి అందులో వేయండి . అప్పుడు పసుపు మసాలా వాసనను కలిగిస్తే.. ఆ పసుపు స్వచ్ఛమైనది. అలా కాకుండా మీరు తెచ్కచిన పసుపు కల్తీ పసుపు అయితే అది ప్లాస్టిక్ వాసన వస్తుంది.
పేపర్ టెస్ట్:
తెల్లటి తడిగా ఉన్న క్లాత్ లేదా కాగితంపై పసుపు పొడినివేయండి. స్వచ్ఛమైన పసుపు లేత పసుపు మరకలను కలిగిస్తుంది. పసుపును కల్తీ చేస్తే, మాత్రం అది ముదురు పసుపు రంగు మరకలను ఏర్పరుస్తుంది.
నీటితో పరీక్షించండి:
ముందుగా కాస్త పసుపును తీసుకుని దానిని నీటిలో కలపండి. ఒక చెంచా పసుపు పొడిని నీటిలో వేసి కొంత సమయం అలాగే ఉంచండి. కొంత సమయం తర్వాత స్వచ్ఛమైన పసుపు నీటిలో అడుగుకు చేరుకుంటుంది. అంతే కాకుండా తర్వాత నీరు స్పష్టంగా కనిపిస్తుంది. పసుపు కల్తీ అయితే నీటి రంగు పసుపు లేదా మురికిగా కనిపిస్తుంది. ఇలా కల్తీ పసుపును సులభంగా గుర్తించవచ్చు.
వెనిగర్:
పసుపుపై కొన్ని చుక్కల వెనిగర్ పోయడం ద్వారా కూడా కల్తీ పసుపు అని ఈజీగా గుర్తించవచ్చు . పసుపులో చిన్న బుడగలు లేదా నురుగు కనిపించడం ప్రారంభిస్తే అందులో సున్నం లేదా సుద్ద కలిపారని అర్థం. స్వచ్ఛమైన పసుపు అయితే రంగు మారదు.
వాసనను గమనించండి:
పసుపు స్వచ్ఛతకు సులభమైన మార్గం దాని వాసన. స్వచ్ఛమైన పసుపు వాసన సహజంగా ఉంటుంది. వాసన లేకపోతే అది కల్తీ అని తెలుసుకోండి.