YS Jagan: వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది 2024 ఏడాది. మరీ 2025 మాటేంటి? గ్రహాలన్నీ అధినేతకు అనుకూలిస్తున్నాయా? అంతా శుభమే జరుగుతుందా? ఫ్యాన్ రెట్టించిన ఉత్సాహంతో గిరగిరా తిరగడం ఖాయమేనా? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఇదే చర్చ ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి.
2025 ఏడాదిలోకి యావత్త ప్రపంచం అడుగుపెట్టేసింది. సాదారణ ప్రజల మాట కాసేపు పక్కనపెడితే.. పాలకులకు అనుకూలిస్తుందా? ఈ ఏడాదీ కష్టాలు తప్పవా? గ్రహాలు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి? ముఖ్యంగా అధికార-విపక్షాల మాటేంటి? అధికార పార్టీకి పర్వాలేదుగానీ, విపక్షాలు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు.
గడిచిన ఐదేళ్లు వైసీపీకి రాజభోగం. అధికారం కోల్పోయిన తర్వాత నేతల మాట పక్కనబెడితే.. వారి వారి పుత్రరత్నాలకు చిక్కులు తప్పడం లేదు. గతంలో వీరి చేసిన పనులే వారిని వెంటాడుతున్నాయని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్యులు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు, అప్పటి ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించిన ఎస్.వై.వీ.కి కష్టాలు తప్పవని చెబుతున్నారు.
జగన్ సర్కార్‌లో చేసిన తప్పులపై విచారణ జరుగుతోంది. ఇది మరింత ముందుకు వెళ్లే అవకాశముంది. సజ్జల, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి కష్టాలు తప్పవని చెబుతున్నారు. జెత్వానీ, సోషల్ మీడియా కేసులో వ్యవహారంలో ఇప్పటికే లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ వ్యవహారం మరింత ముదరవచ్చని చెబుతున్నారు జ్యోతిష్యులు.
ALSO READ: అటు సంక్షేమం, ఇటు రాష్ట్రాభివృద్ధి.. ప్రజల సహకారంతో చేస్తామన్న సీఎం.. ప్రజలకు శుభాకాంక్షలు
వైవీ సుబ్బారెడ్డి మాటకు వద్దాం. లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయనను సిట్ విచారించేం దుకు సిద్ధమవుతున్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఆయన కొడుకు కాకినాడ పోర్టు మార్పిడి వ్యవహరంలో పీకల్లోతుల్లో మునిగిపోయారు. ఆపై ఈడీ కూడా దృష్టి పెట్టింది. అంటే తండ్రీకొడుకు లిద్దరికి కష్టాలు తప్పవనే సంకేతాలు బలంగా వున్నాయి.
వైసీపీ చిత్రగుప్తుడిగా విజయసాయిరెడ్డిని కొందరు రాజకీయ నేతలు వర్ణిస్తుంటారు. ఎందుకంటే నేతల లెక్కలు, చిట్టా పద్దులన్నీ ఆయనకే తెలుసని తరచూ చెబుతుంటారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన చేయి ఉన్నట్లు అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల రాలేదని రిప్లై ఇచ్చేశారు. ఈ నేతలకూ గ్రహాలు అనుకూలించలేదు.
ఇక జగన్ విషయానికొద్దాం. కూటమి సర్కార్ ఆయనను టచ్ చేయలేదు. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న నేతలను వెంటాడుతున్నారు. త్రిమూర్తులు ఇప్పటికే ఇరకాటంలో పడ్డారు. ఆయా నేతల ఆదేశాలతో తాము పనులు చేశామని పట్టుబడినవారు చెబుతున్నారు. ఈ లెక్కన జగన్ చుట్టూ ఉన్న నేతలు ఇరుక్కున్నట్టే. అలాగే మాజీ సీఎం జగన్ బంధువులు కడప ఎంపీ అవినాష్‌కు కష్టాలు తప్పవని జ్యోతిష్యుల మాట.
ఇక జగన్ విషయాని కొద్దాం. ఇటు ఫ్యామిలీ నుంచి అటు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో నేతలు వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా రాహు-కేతువులు జగన్‌ని పట్టిపీడుస్తున్నారని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్యులు. ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుందన్నది వారి మాట. ఓవరాల్‌గా 2025 కూడా చిక్కులేనన్నమాట.