BigTV English

YS Sharmila: రాష్ట్రంలో బీజేపీ చేసిన మోసానికి జగన్ మౌనం వహిస్తున్నారు: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila: రాష్ట్రంలో బీజేపీ చేసిన మోసానికి జగన్ మౌనం వహిస్తున్నారు: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila:APCC Chief YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని, రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి సీఎం జగన్ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నవారు ఇప్పడు మోకరిల్లారన్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఈ విషయంపై మౌనం వహించడం మరింత దారణం అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.


ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి ఊపిరిలాంటి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకుండా మోసం చేస్తే.. అందుకు జగన్ ప్రభుత్వం మౌనంగా ఉడడం మరింత దారణమని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు, రాజకీయ, కార్మిక, రైతు ప్రజా సంఘాల ఐక్య వేదిక సంఘాలు హాజరయ్యాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

దేశ సంపదను బీజేపీ అదానీ, అంబానీలను దోచిపెడుతోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలోని గంగవరం పోర్టు భూములు ధారాదత్తం చేసి తక్కువ ధరకే అదానికి బీజేపీ, జగన్ ప్రభుత్వాలు అందించాయని విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కేంద్రం వారికి కట్టబెట్టాలని చూస్తుందన్నారు. బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని.. వీటికి పరోక్షంగా సపోర్ట్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Also Read: Chandrababu Pawan Kalyan Meet : చంద్రబాబుతో జనసేనాని భేటీ.. ఎన్నికల వ్యూహంపై చర్చ..

వచ్చే ఎన్నికల్లో అందరిని కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంలో మాత్రం చివరి స్థానంలో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు ప్రజలు ఆత్మగౌరవం దెబ్బ తీసేలా జగన్, చంద్రబాబు వ్యవహిస్తున్నారని వారిపై మండిపడ్డారు.

Tags

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×