YS Sharmila on YS Jagan: 11 మంది వచ్చారు. 11 నిమిషాలు ఉండలేకపోయారు. ప్రజా సమస్యలు ముఖ్యం కాదు. కేవలం ప్రతిపక్ష హోదా ముఖ్యం.. ఇదేనా జగన్ గారూ.. మీ పార్టీ వైఖరి అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై స్పందించిన షర్మిళ.. జగన్ ను ఉద్దేశించి మాత్రం సంచలన కామెంట్స్ చేశారు. అలా వచ్చారు ఇలా వెళ్లారు.. ఇది మీకు కరెక్ట్ కాదంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం మాజీ సీఎం జగన్ కూడా సభకు హాజరయ్యారు. వస్తారా లేక గైర్హాజరు కానున్నారా అనే అంశం చర్చకు దారితీసిన క్రమంలో ఎట్టకేలకు జగన్ తో పాటు వైసీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ నజీర్ తన ప్రసంగం సాగిస్తుండగానే, వైసీపీ సభ్యులు లేచి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అంతేకాకుండా గవర్నర్ ప్రసంగం ప్రతులను చించిన విషయం తెలిసిందే. అలాగే వాకౌట్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే తాజాగా ఇదే అంశంపై వైఎస్ షర్మిళ సెన్సేషనల్ ట్వీట్ చేసి మరోమారు జగన్ పై, వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. ఆమె చేసిన ట్వీట్ ఆధారంగా.. గవర్నర్ ప్రసంగంలో పసలేదని, దిశా నిర్దేశం అంతకన్నా లేదన్నారు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు చెప్పారన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని, సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదన్నారు.
ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్ప, మిగతా 5 హామీలపై స్పష్టత లేదని విమర్శించారు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు గారి విజన్ 2047కి దమ్ము లేదన్నారు. 8 నెలల పాలన కాలయాపన తప్ప, ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదని కూటమిని ఉద్దేశించి షర్మిళ ట్వీట్ చేశారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయి? 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు? తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు? కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవన్నారు.
ఛీ కొట్టినా.. జగన్ మారలేదు
షర్మిళ చేసిన ట్వీట్ లో జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ప్రజలు ఛీ కొట్టినా జగన్ లో ఏమార్పు రాలేదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా అంటూ ఆమె ప్రశ్నించారు.
Also Read: AP New Ration Cards: త్వరలో సూపర్ సిక్స్ అమలు.. ఈ కార్డు తప్పనిసరి.. అప్లైకి రెడీనా?
ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారన్నారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నట్లు తెలిపారు. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచిచూడాలి.
గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత…
— YS Sharmila (@realyssharmila) February 24, 2025