CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుని బీజేపీకి మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
‘తెలంగాణలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతులు తెచ్చారా..? గ్రాడ్యుయేట్ లు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరు. కానీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ను ఓడించాలని అంటున్న బీఆర్ఎస్ మరి ఎవర్నీ గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరికీ ఓటు వేస్తారో ఆలోచించిండి. నా మాటలు నిజమని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: DCIL Recruitment: డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగం భయ్యా.. మిస్ అవ్వకండి.. రేపే లాస్ట్ డేట్
‘బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరికే ఉద్యోగాలు కల్పించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఓటు వేసే ముందు ఆలోచించాలి. మేం అధికారంలోకి రాగానే 55వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. నా మాటలు నిజమని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: Neera Cafe: నీరా కేఫ్ వివాదం.. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారంపై స్పందించిన రేవంత్ సర్కార్
‘వరి వేస్తే ఉరి వేసినట్టే అని గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ నేతలు అన్నారు. మేం వరి వేసిన వాళ్లకు కూడా బోనస్ ఇస్తున్నాం. రైతు భరోసాను కూడా మార్చి 31 వరకు పూర్తి చేస్తాం. రూ.21వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం. రుణమాఫీ జరిగిన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి. కేసీఆర్ చేసిన అప్పులు రాష్ట్రానికి ముప్పుగా మారాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ నిజమైతేనే మాకు ఓటు వేయండి’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: Indian Navy Jobs: ఇండియన్ నేవిలో 270 ఉద్యోగాలు.. రేపే లాస్ట్..!
‘కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యతను మేం తీసుకున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఏడాది తిరిగే లోపు రూ.2.25లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడైనా స్వయం సహాయక బృందాల గురించి పట్టించుకున్నారా..? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ అంటున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ రావులను దేశానికి రాకుండా కాపాడేది బండి సంజయ్ కాదా..? వాళ్లను రప్పిస్తే 48 గంట్లలో కేటీఆర్ ను జైలులో పెడతామనే కదా ప్రభాకర్ రావు, శ్రవన్ రావు రాకుండా కాపాడుతున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.