E-Paper
Advertisement

YS Sharmila Jagan : రాజారెడ్డి పెళ్లి.. జగన్ కు షర్మిల ఆహ్వానం..

YS Sharmila Jagan : రాజారెడ్డి పెళ్లి.. జగన్ కు షర్మిల ఆహ్వానం..
Advertisement

YS Sharmila Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెళ్లారు. భర్త అనిల్‌ కుమార్, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి అన్న నివాసానికి వచ్చారు. షర్మిల ఫ్యామిలీ కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంలో దిగింది. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను జగన్‌కు అందించారు.

షర్మిల వెళ్లిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఎం నివాసానికి వెళ్లారు. షర్మిల వెళ్లిన కాసేపటికి సీఎం క్యాంపు ఆఫీస్‌కు ఆర్కే వచ్చారు. అయితే ఆర్కే వాహనాన్ని లోపలికి వెళ్లకుండా తొలుత పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత ఆదేశాలు రావడంతో ముఖ్యమంత్రి నివాసంలోకి ఆర్కేను అనుమతించారు.

Advertisement

గన్నవరం నుంచి వస్తున్న సమయంలో తన వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుందని ఆర్కే వెల్లడించారు. అందువల్లే షర్మిల వెంటే వెళ్లలేకపోయాయని తెలిపారు. మరోవైపు షర్మిల గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను కూడా కాంగ్రెస్‌లో చేరతానని ఆర్కే ప్రకటించారు. ఆ పార్టీ విధానాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. జగన్‌పై ఆరోపణలు, విమర్శలు చేసే విషయంతో కాంగ్రెస్‌ ఆదేశాలను పాటిస్తానని తేల్చిచెప్పారు. షర్మిలతోపాటు ఎవరెవరు పార్టీలో చేరతారనే విషయం తనకు తెలియదని ఆర్కే అన్నారు.

Related News

గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు.. ఉచితంగా నిత్యావసరాలు, రూ.3 వేలు సాయం

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. దూసుకొస్తున్న మరొక తుఫాను, వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు

అర్నబ్ తుపాను తాకిడికి అతలాకుతలమైన కోనసీమ.. రైతుల కళ్లల్లో కన్నీళ్లు!

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగండం.. తెలంగాణలో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట.. ఇసుక తిన్నెలను వడపోస్తున్న స్థానికులు!

Big Stories

Advertisement
×