E-Paper
Advertisement

వావ్.. ఏకంగా 7 ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, యాపిల్ లవర్స్‌కు పండగ లాంటి ఆఫర్!

వావ్.. ఏకంగా 7 ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, యాపిల్ లవర్స్‌కు పండగ లాంటి ఆఫర్!
Advertisement

Flipkart Diwali Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 15తో పాటు ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రో సిరీస్ మోడళ్లను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 17పై రూ.20,000 వరకు ఆదా చేసే అవకాశం ఉండటంతో ఈ సేల్‌పై ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై బోనస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ మంచి అవకాశంగా మారింది. మరి ఏ ఐఫోన్ మోడల్‌పై ఎంత తగ్గింపు ఉంది? ఏ ఫోన్‌ను ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చు? వంటి వివరాలు తెలుసుకుందామా..

ఐఫోన్ల ధరలివే:

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ఏడు ఐఫోన్ మోడళ్లు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 అసలు ధర రూ.99,900 కాగా, అన్ని ఆఫర్లు కలిపితే రూ.79,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 15ను రూ.59,999కు కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రూ.1,73,900కు, ఐఫోన్ 18 ప్రో రూ.1,58,900కు లభిస్తున్నాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,42,900 కాగా, ఐఫోన్ 17 ప్రో రూ.1,27,900కు అందుబాటులో ఉంది. మరోవైపు, ఐఫోన్ ఎయిర్‌ను రూ.99,900కే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: గ్రూప్ చాటింగ్ ఇకపై సూపర్ ఈజీ.. వాట్సప్ తెచ్చిన ఆ 4 కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

బ్యాంక్ ఆఫర్లు:

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు అర్హమైన క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు, గరిష్ఠ డిస్కౌంట్ పరిమితులను కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవాలి. అర్హత ఉన్న కార్డుతో చెల్లిస్తే ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

ఎక్స్ఛేంజ్ బోనస్:

Advertisement

కొత్త ఐఫోన్ కొనేటప్పుడు పాత ఫోన్‌ను మార్చుకోవాలనుకునే వారికి కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రకటించింది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై దాని విలువకు అదనంగా రూ.5,000 వరకు బోనస్ పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనం ఫోన్ మోడల్, కండిషన్, ఎక్స్ఛేంజ్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, యాపిల్ ఐక్లౌడ్ ప్లస్ 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌ను రూ.749కే అందిస్తోంది. దీంతో ఐఫోన్‌తో పాటు క్లౌడ్ స్టోరేజ్ సేవను కూడా తక్కువ ధరకే పొందవచ్చు.

కొనడానికి ఇదే టైమ్:

కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ దీపావళి సేల్‌లో పలు మోడళ్లను పోల్చి చూసే అవకాశం ఉంది. మీ బడ్జెట్‌ను బట్టి ఐఫోన్ 15, ఐఫోన్ 17 లేదా ప్రో సిరీస్ మోడళ్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అయితే సేల్‌లో చూపించే కొన్ని ధరలు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కలిపి లెక్కించినవే. అందుకే ఆర్డర్ చేసే ముందు తుది ధర, ఆఫర్ల నిబంధనలు, స్టాక్ వివరాలను తప్పకుండా పరిశీలించండి.

Also Read: మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ ఈజ్ బ్యాక్.. కార్బన్ నుంచి రాబోతున్న ఆ రెండు ఫోన్లు ఇవే!

Tags

Related News

స్పీకర్ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు అన్నీ ఆఫర్లో.. రూ.3,000 లోపు బెస్ట్ దీపావళి గిఫ్ట్స్ మీ కోసం!

40 గంటల బ్యాటరీ బ్యాకప్.. ఫ్రీ గానా సబ్‌స్క్రిప్షన్‌తో Noise Buds R1 Gaana Edition లాంచ్!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ. 123కే అపరిమిత కాల్స్, డేటా, సినిమాలు.. మిస్ అవ్వకండి!

బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్‌వాచ్..నాయిస్ నుంచి కొత్త మోడల్ లాంచ్

మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ ఈజ్ బ్యాక్.. కార్బన్ నుంచి రాబోతున్న ఆ రెండు ఫోన్లు ఇవే!

ప్రీమియం లుక్,పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్.. మోటోబుక్ 60 ధర ఎంతంటే?

గ్రూప్ చాటింగ్ ఇకపై సూపర్ ఈజీ.. వాట్సప్ తెచ్చిన ఆ 4 కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

Big Stories

Advertisement
×