BigTV English
Advertisement

YS Sharmila meets Jagan | కాంగ్రెస్‌లో చేరేముందు అన్న జగన్‌తో షర్మిల భేటీ.. కారణమిదే..

YS Sharmila meets Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అన్న చెల్లెళ్ల మధ్య వార్ మొదలవుబోతోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక దాదాపు ఖాయం కావడంతో ఏపీ పాలిటిక్స్ వేడి పీక్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల తన అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. దీనికి కారణం ఏముంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో శత్రువులుగా మారిన వీరిద్దరూ.. ఎన్నికల ముందు ఒకసారి కలుసుకోనున్నారు.

ఈ విషయంలో షర్మిల స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. షర్మిల బుధవారం ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. వైఎస్ షర్మిల పులివెందుల సమీపంలోని ఇడుపులపాయ వద్ద జననేత వైఎస్సార్‌ సమాధి వద్ద మంగళవారం నివాళులర్పించారు. ఆమె వెంట కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితోపాటు ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ కూడా ఉన్నారు.

‘‘గతంలోనే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందుకోసమే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చాం. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవడానికి వైఎస్ఆర్‌టిపీ 31 స్థానాల్లో పోటీ పెట్టకపోవడమే కారణం. కాంగ్రెస్‌ అధిష్ఠానం మా త్యాగాన్ని గుర్తించి ఆహ్వానించింది. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకే బుధవారం దిల్లీ వెళ్తున్నాను. మరో రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. నా కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా వైఎస్సార్‌ ఆశీస్సులు కోసమే ఇడుపులపాయ వచ్చాను’’ అని వైఎస్ షర్మిల వివరించారు.

ఇదిలా ఉంటే బుధవారం తాడేపల్లిలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఏపీ సీఎం జగన్ ను సోదరి షర్మిల కలుసుకోనున్నారు. తల్లి విజయమ్మతోపాటు ఆమె జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఇడుపులపాయ నుంచి నేరుగా తాడేపల్లికి వెళ్లనున్నారు షర్మిల. తన తనయుడు ఎంగేజ్ మెంట్ వేడుకకు జగన్ ను ఆహ్వానించనున్నారు. జగన్ ను కలిసిన తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్న నేపథ్యంలో ఇద్దరి ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరిక అంశం కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

Big Stories

×