BigTV English

Kodali Nani: కొడాలి గుండెపోటు వార్తలపై వైసీపీ క్లారిటీ.. అసలేమైందంటే..?

Kodali Nani: కొడాలి గుండెపోటు వార్తలపై వైసీపీ క్లారిటీ.. అసలేమైందంటే..?

మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త సర్కులేట్ అవుతున్నా కూడా కుటుంబ సభ్యులు కానీ, కనీసం ఆయన తరపున ఇంకెవరైనా కానీ ఈ వార్తల్ని ధృవీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. దీంతో ఇది దాదాపు నిజమనే అనుకున్నారంతా. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన ఆస్పత్రికి వెళ్లగా అక్కడ గుండె సమస్యను గుర్తించారని, వెంటనే ఆపరేషన్ లేదా స్టంట్ వేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇదంతా కేవలం వదంతులంటూ వైసీపీ కాస్త ఆలస్యంగా స్పందించింది. అస్వస్థత నిజమే అయినా గుండెపోటుగా దాన్ని చిత్రీకరించడం మాత్రం సరికాదంటున్నారు వైసీపీ నేతలు.


వైసీపీ రియాక్షన్

సోషల్ మీడియాలో కొడాలి ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు సీనియర్ నేత దుక్కిపాటి శశిభూషణ్. ఈమేరకు ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారంటూ సాక్షిలో ఓ కథనం వచ్చింది. అదే సమయంలో కొడాలి నాని పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో టీమ్ కొడాలి పేరుతో కూడా ఓ ఇన్ఫో ఇచ్చారు. వదంతులు నమ్మొద్దని అందులో పేర్కొన్నారు. ఈ మొత్తం వివరాలతో సాక్షిలో వార్త ప్రచురితమైంది.



కొడాలికి గుండెపోటు అనగానే టీడీపీ సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు పడ్డాయి. గతంలో కొడాలి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రస్తావిస్తూ మీమ్స్ చేశారు. అరెస్ట్ అనగానే చంద్రబాబు నాటకాలు ఆడారంటూ గతంతలో కొడాలి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. బెయిల్ కోసం నాటకాలాడుతున్నారని అప్పట్లో కొడలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు కూడా. వాటన్నిటినీ టీడీపీ మరోసారి హైలైట్ చేస్తూ కర్మ రిటర్న్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టింది. రెడ్ బుక్ లో నెక్ట్స్ పేరు కొడాలిదేనని, అందుకే ఆయన ఇలా నాటకాలాడుతున్నారని కూడా కొంతమంది టీడీపీ సానుభూతిపరులు పోస్ట్ లు చేశారు. దీంతో సోషల్ మీడియాలో కొడాలి ఆరోగ్యం వార్తలు వైరల్ గా మారాయి.

దూకుడు తగ్గింది..

వాస్తవానికి కొడాలి దూకుడు ఇటీవల బాగా తగ్గింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ నుంచి ఎవరు వాయిస్ పెంచినా, ఇక్కడ కొడాలి నుంచి కౌంటర్ పడేది. చంద్రబాబుని, లోకేష్ ని తీవ్రంగా విమర్శించారాయన. అధికారం పోయిన తర్వాత కొడాలి జోరు తగ్గింది. వైసీపీ నుంచి ఇతర నేతలు మీడియా ముందుకొస్తున్నా ఆయన మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దాదాపు నియోజకవర్గానికి కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్ లోనే కాలక్షేపం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆమధ్య వల్లభనేని వంశీ కేసు కోసం కోర్టు వద్దకు వచ్చి మీడియాపై కూడా చిర్రుబుర్రులాడారు నాని. మిర్చి రైతుల్ని మాజీ సీఎం జగన్ పరామర్శించే సందర్భంలో కూడా కొడాలి బయటకు వచ్చినా హడావిడి లేదు.

రెడ్ బుక్ లో పేరుందా..?

రెడ్ బుక్ లో వల్లభనేని వంశీ పేరుతోపాటు కొడాలి పేరుకూడా ఉందనే వదంతులు ఉన్నాయి. అయితే కొడాలి విషయంలో రెడ్ బుక్ ఇంకా తెరిచినట్టు లేదు. ప్రస్తుతానికి వల్లభనేని వంశీ మాత్రమే వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. బెయిల్ కోసం ఆయన తిప్పలు పడుతున్నారు. త్వరలో కొడాలి కూడా జైలుకెళ్లక తప్పదని ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థత వారికి అవకాశంగా మారింది. అందుకే ఉన్నవి లేనివి కల్పించి గుండెపోటు, ఆపరేషన్.. అయ్యయ్యో కొడాలి అంటూ పోస్టింగ్ లు పెట్టారు. వైసీపీ నేతలు మాత్రం ఈ పోస్టింగ్ లపై మండిపడుతున్నారు. ఆరోగ్యం విషయంలో తప్పుడు వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×