Highest Paid Actress In OTT : ఒకప్పుడు హీరోయిన్లు వరుస హిట్ సినిమాలు పడటంతో రెమ్యూనరేషన్ పెంచే వాళ్ళు.. కానీ ఈ మధ్య ఓటీటీ అందుబాటులోకి రావడంతో ఇక్కడ సినిమాలు చేస్తూ స్టార్ హీరో, హీరోయిన్లు బిజీగా అవుతున్నారు. కేవలం సినిమాలు మాత్రమే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమాల కంటే క్వాలిటీ, ఉత్తమమైన కంటెంట్ వాటి ద్వారా ప్రేక్షకులకు వస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై కనిపించే స్టార్ల స్థాయిలో ఇప్పుడు ఓటీటీ నటీనటులు కూడా రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు.. టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో స్టార్స్ ఎక్కువగా సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు.. సినిమాల కన్నా ఎక్కువగా ఓటీటీ ద్వారా సంపాదిస్తున్నారు. ఇక ఓటీటీ లో అందరి కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓటీటీ ద్వారా చాలా మంది లైఫ్ ఓ రేంజ్ లోకి మారింది.. ఎటువంటి వాళ్ళనా కూడా ఇక్కడ బిజీ అయ్యారు. అలాగే ఓటీటీలో కనిపిస్తు రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో కొందరు నటీనటులు ఓటీటీ స్పేస్ ను ఏలుతున్నారు. అలా బాలీవుడ్ నుంచి ఎంతో మంది టాప్ నటీనటులు ఓటీటీ ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. కానీ వాళ్లందరిని వెనక్కి నెట్టి అతి తక్కువ కాలంలోనే ముందుకు వచ్చేసింది సమంత. సినీ ఇండస్ట్రీలో ఆమెకు టైం బాగోలేదు. గతంలో వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. ఒరిజినల్స్ లో నటించినందుకు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ అంటే ఒక్క సమంత పేరే వినిపిస్తుంది.. ఈమె కోలీవుడ్, టాలీవుడ్ లలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె కొన్నాళ్లుగా అరుదైన వ్యాధి కారణంగా డల్ అయ్యింది. సినిమాలను కూడా బాగా తగ్గించేసింది. రెండేళ్లుగా ఒక్క హిట్ మూవీ కూడా ఆమె ఖాతాలో లేదు. అయినా ఓటీటీ స్పేస్ లో మాత్రం సమంతకు డిమాండ్ తగ్గలేదు. ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది.
బాలీవుడ్ లో ఆమె చేసిన ఒక్క వెబ్ సిరీస్ కే దాదావు రూ. 10 కోట్లు తీసుకుందని సమాచారం.. అంటే ఆమె రేంజ్ ఏ మాత్రం ఉందో అర్థమవుతుంది. ఈ మధ్య వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ చేసింది. పూర్తి యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయిన ఈ సిరీస్ తాను చేయలేనని మొదట అనుకున్నా.. తర్వాత ఆ పాత్రను ఆమె పోషించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన యాక్షన్ తో ఆమె కట్టి పడేసింది. సమంతతో పాటు వరుణ్ ధావన్ కూడా నటించాడు. తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు.. ఈ మధ్య తెలుగులో చేసిన యశోద, శాకుంతలం, ఖుషీ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సామ్ కు సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఇక ముందు చేసే వెబ్ సిరీస్ లకు రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తుంది.