BigTV English

YS Sharmila on YCP: వైసీపీకి షాకిచ్చిన షర్మిళ.. ఆ కోణంలో విచారణ సాగించాలని డిమాండ్!

YS Sharmila on YCP: వైసీపీకి షాకిచ్చిన షర్మిళ.. ఆ కోణంలో విచారణ సాగించాలని డిమాండ్!

YS Sharmila on YCP: గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు వైఎస్ షర్మిళ డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ పాలనలో ఏం జరిగిందనేది ప్రజల ముందుంచాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని షర్మిళ డిమాండ్ చేశారు. నిన్న సీఎం చంద్రబాబు నీతి అయోగ్ నివేదిక వివరిస్తూ చేసిన కామెంట్స్ పై షర్మిళ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ప్రభుత్వంపై, వైసీపీని ఉద్దేశించి షర్మిళ ఘాటుగా వ్యాఖ్యానించారు.


షర్మిళ చేసిన ట్వీట్ ఆధారంగా.. ఏపీలో సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనన్నారు. సీఎం చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమన్న షర్మిళ, నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పడం తగదన్నారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలని చెప్పడంపై మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది కూటమి తీరని షర్మిళ విమర్శించారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారన్నారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని, 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని షర్మిళ అన్నారు.

పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే సీఎం.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం, సూపర్ సిక్స్ పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారమని అన్నారు. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరేనని, కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నది మీరే. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసమని షర్మిళ ప్రశ్నించారు.


Kurnool Crime: విద్యార్థిని జుట్టు కత్తిరించి.. చేయి కోశారు.. కర్నూల్‌‌‌‌‌లో దారుణ ఘటన

రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని.. పథకాల అమలుపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టండి. పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగాలన్నారు. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చండి. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని షర్మిళ అన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×