BigTV English

War 2 : మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా… ‘వార్ 2’లో సూపర్ స్టార్ కూడా…

War 2 : మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా… ‘వార్ 2’లో సూపర్ స్టార్ కూడా…

War 2 : ఈ ఏడాది మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘వార్ 2’ (War 2) కూడా ఒకటి. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హైప్ ఈ రేంజ్ లో పెరగడానికి ముఖ్య కారణం హృతిక్ రోషన్ (Hrithik Roshan) – ఎన్టీఆర్ (NTR) కాంబో. ‘వార్ 2’తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుండడం ప్రాజెక్ట్ పై మరింత బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) కూడా భాగం కాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.


‘వార్ 2’లో మహేష్ బాబు 

‘వార్ 2’ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇందులో హృతిక్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో మహేష్ బాబు కూడా భాగం కాబోతున్నారనే బజ్ తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఇందులో ఆయన హీరోగా లేదంటే అతిథి పాత్రను చేయడం లేదనేది ఆ రూమర్ సారాంశం. మరి మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా భాగం కాబోతున్నారు అంటే… ‘వార్ 2’ సినిమా తెలుగు వెర్షన్‌కి మహేష్ తన వాయిస్‌ని అందిస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి.


మహేష్ – ఎన్టీఆర్ కాంబో ఇదే మొదరిసారి కాదు 

ఒకవేళ ఈ రూమర్లు గనక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్‌కు మహేష్ వాయిస్‌ ఓవర్ ఇవ్వడం ఇది రెండవసారి అవుతుంది. 2013 లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘బాద్షా’లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ‘వార్ 2’ హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై ఇంకా అఫిషియల్ గా ఎలాంటి సమాచారం రాలేదు.

‘వార్ 2’ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వార్ 2’ మూవీని ఆగష్టు 15న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఇటు హృతిక్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ‘వార్ 2’ గురించి మహేష్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు.

మహేష్ ఫ్యాన్స్ కు ఊరట 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈ మూవీ పూర్తి కావాలన్నా, రిలీజ్ కావాలన్నా చాలా టైం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా మహేష్ బాబు మరో సినిమాలో నటించే ఛాన్స్ లేదు. ఒకవేళ ‘వార్ 2’ మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనే వార్త నిజమైతే కనక, మహేష్ బాబు అభిమానులకు కొంచెం ఊరట లభించినట్టే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×