BigTV English

AP Liquor Politics | ఏపీ మద్యం పాలసీపై ప్రతిపక్షాల గురి.. నాసిరకం మద్యం కూడా అధిక ధర!

AP Liquor Politics | ఏపీ రాజకీయాల్లో లిక్కర్ బ్రాండ్లు తెగ ఫోకస్ అవుతున్నాయి. రాష్ట్రంలో మద్యం పాలసీపై మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ మందు బాబుల ప్రాణాలను హరించేలా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తోందని, మొత్తం మద్యం విధానమంతా వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

AP Liquor Politics | ఏపీ మద్యం పాలసీపై ప్రతిపక్షాల గురి.. నాసిరకం మద్యం కూడా అధిక ధర!

AP Liquor Politics | ఏపీ రాజకీయాల్లో లిక్కర్ బ్రాండ్లు తెగ ఫోకస్ అవుతున్నాయి. రాష్ట్రంలో మద్యం పాలసీపై మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ మందు బాబుల ప్రాణాలను హరించేలా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తోందని, మొత్తం మద్యం విధానమంతా వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ విధానానికి సంబంధించి టీడీపీ, బీజేపీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా షర్మిల సైతం రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై సెటైర్లు విసిరి కలకలం రేపారు.


మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తాం. ఎన్నికల ముందు వైసీపీ రిలీజ్ చేసిన నవరత్నాల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అది. అంత ఘనంగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన వైసీపీ .. అయిదేళ్లు గడిచిపోతున్నా ఆ హామీని పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది. అయితే గుడివాడ అమర్‌నాథ్ లాంటి మంత్రులు అసలు మద్యనిషేధంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను పూర్తిగా ప్రభుత్వ పరం అయ్యాయి. వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన బ్రాండ్లను ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే విక్రయిస్తున్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో.. వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేస్తున్నారని గతంలో ఎన్నడూ చూడని.. ఎప్పుడూ వినని బ్రాండ్లు విక్రయిస్తున్నారని విమర్శిస్తున్న విపక్షాలు.. వాటికి జే బ్రాండ్ లిక్కర్ అని పేరు కూడా పెట్టాయి. ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి .


ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ నకిలీ మద్యం, మద్యం పాలసీలపై పోరాడుతున్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణ కూడా కోరారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాని వెనుక ఉన్న పెద్దల పేర్లనూ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఎన్నికల ముందు మద్య నిషేధం మీద సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైంది?.. వైసీపీ ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది నిజం కాదంటారా? అని నిలదీశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు చేసిన ఫిర్యాదుపై కేంద్రం రియాక్ట్ కాలేదు కాని .. ఏపీలో చిత్రవిచిత్రమైన పేర్లతో ఇష్టానుసారం రేట్లతో లిక్కర్ విక్రయాలు జరిగిపోతునే ఉన్నాయి.

ఆ క్రమంలో జగన్‌పై పొలిటికల్ యుద్దం ప్రకటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. ఏపీలో కల్తీ మద్యంపై ధ్వజమెత్తడం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోందంట. తాజాగా కడప జిల్లా వచ్చిన షర్మిల తానూ దివంగత వైఎస్‌ బిడ్డనే, వైఎస్‌ షర్మిలారెడ్డినే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చానని.. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను .. పోలవరం కట్టే వరకు వదలను .. ఎవరికీ భయపడను.. వైసీపీ వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోండని ప్రకటించారు.

వైఎస్ ఉన్నంతకాల బీజేపీ విధానాలను వ్యతిరేకించేవారని.. అలాంటిది మైనారిటీలు, క్రిస్టియన్లపై బీజేపీ దాడులు చేస్తుంటే జగన్ స్పందించడం లేదని విమర్శించారు. వైఎస్ఆశయాలను కొనసాగించలేని మీరు ఆయన వారసులు ఎలా అవుతారు? పోలవరం గురించి అడిగే సత్తాలేదు. హోదా కోసం మాట్లాడే పరిస్థితి లేదని షర్మిల వరుస విమర్శలు గుప్పించారు.

ఆ క్రమంలో ఆమె ఏపీలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ లిక్కర్ కారణంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం అధికంగా రణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ఈ పాపం ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు .. ‘స్పెషల్‌ స్టేటస్‌’ పేరుతో మద్యం బ్రాండు విక్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మరి ఏపీ ప్రభుత్వ వైన్ షాపుల్లో స్పెషల్ స్టేటస్ పేరుతో చీప్ లిక్కర్ దొరుకుతుందో లేదో కాని .. సోషల్ మీడియాలో మాత్రం ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ సర్కారు వైఖరి తెగ ట్రోల్ అయిపోతోంది. మొత్తమ్మీద ఎన్నికల టైంలో ఏపీ లిక్కర్ పాలసీ, అక్కడ దొరుకుతున్న బ్రాండ్లు విపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారిపోయాయి.

YS Sharmila, Cheap Liquor, target, Jagan Govt, AP Liquor policy, Jagan Govt, Andhra Pradesh news,

Tags

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×