Amaravati: కాలం మారింది.. వర్షాకాలం కాస్త ఎండాకాలంగా మారింది. ఫలితంగా రోడ్డు, అగ్రి ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో కేఎల్ యూనివర్సిటీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమయంలో అందులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లైబ్రరీ భవన్‌లోని నాలుగో అంతస్తులో ఈ ఘటన జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దాలు పెద్దగా రావడం, అగ్ని కీలలు బయటకు కనిపించడంతో ప్రాంగణంలోవున్న విద్యార్థులు పరుగులు తీశారు. ఈలోగా వర్సిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
లైబ్రరీ బిల్డింగ్‌లోని ఫైర్ సేఫ్టీ పరికరం నుంచి వచ్చిన నీటి తుంపర్లు కొంతవరకు మంటలను అదుపు చేశాయి. ఈలోగా వర్సిటీలోని సెక్యూరిటీ సిబ్బంది మంగళగిరి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో విద్యార్థులు బయట వుండడంతో పెను ప్రమాదం తప్పింది.
ALSO READ: నాడు జగన్, నేడు చంద్రబాబు.. బీసీల విషయంలో ఇద్దరూ వెన్నుపోటు దారులే: వైఎస్ షర్మిల!
ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వర్సిటీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అగ్నిప్రమాదంలో ఎంతమేరా నష్టం వాటిల్లింది, ఏమేం దగ్ధమయ్యాయన్నది ఇంకా తెలియాల్సివుంది. భారీగా పుస్తకాలు దగ్దమైనట్టు సిబ్బంది చెబుతున్నారు.
#KLUniversity #Vijayawada #NewsUpdate
🚨 Reports of a fire/blast incident at KL University, central library Vijayawada
Hoping everyone on campus is safe. 🙏 Authorities should provide clear and timely information regarding what happened, the cause of the incident, and whether… pic.twitter.com/7nsENmbprT
— princerahul (@princerahulmb) October 1, 2026