BigTV English

Chandrababu Jagan: చంద్రబాబు ఆటో రైడ్ పై వైసీపీ విమర్శలు.. దిమ్మతిరిగేలా నెటిజన్ల కౌంటర్లు

Chandrababu Jagan: చంద్రబాబు ఆటో రైడ్ పై వైసీపీ విమర్శలు.. దిమ్మతిరిగేలా నెటిజన్ల కౌంటర్లు

చంద్రబాబు ఆటో ఎక్కారు..
వైసీపీ విమర్శలు చేసింది..
మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ నిందలు వేయాలని చూసింది.
అంతలోనే రివర్స్ అటాక్ మొదలైంది.
జగన్ ఫొటోలు బయటకు వచ్చాయి.
వైసీపీ సైలెంట్ అయింది.
క్లుప్తంగా ఇదీ ఈ స్టోరీ. ఇప్పుడే కాదు, గతంలో కూడా చంద్రబాబుని, టీడీపీని టార్గెట్ చేయాలనుకున్న ప్రతి సారీ వైసీపీ తనకు తాను సెల్ఫ్ గోల్స్ వేసుకుంది. ఆ గోల్స్ లో ఇది మరొకటి మాత్రమే.


ఏం జరిగింది?
ఆగస్ట్-1 న కడప జిల్లా జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పెన్షన్‌ను అందించారు సీఎం చంద్రబాబు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి ఇంట్లో ఉన్న చేనేత మగ్గాన్ని పరిశీలించారు. అలివేలమ్మ చిన్న కుమారుడు జగదీష్ ఆటో నడుపుతాడని తెలుసుకుని, అతని వాహనం ఎక్కి ప్రజా వేదిక వద్దకు వచ్చారు. ఆటోని జగదీష్ నడుపుతుండగా, చంద్రబాబు వెనక కూర్చున్నారు. అతడితో మాట్లాడుతూ వేదిక వచ్చిన చంద్రబాబు. ఆటో ఆపివేసిన తర్వాత ముందుకు వచ్చి డ్రైవర్ సీట్ పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు.

వైసీపీ విమర్శలేంటి?
అయితే వైసీపీ నేతలకు చంద్రబాబు ఆటో ఎక్కడం నచ్చలేదు. దీంతో విమర్శలు మొదలు పెట్టారు. చంద్రబాబు ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నారని, అది మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 177, 179 లను ఉల్లంఘించినట్టవుతుందని అన్నారు. ఈ ఉల్లంఘనపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయరా అని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు, రూల్స్ మాకేనా, మీకు లేవా అని నిలదీసినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

నెటిజన్ల సమాధానం ఏంటి?
వాస్తవానికి చంద్రబాబు ఆటోలో డ్రైవర్ పక్కన ఎక్కి ఎక్కడికీ వెళ్లలేదు. కేవలం ఫొటోలకు మాత్రమే అక్కడ కూర్చుని స్టిల్ ఇచ్చారు. చంద్రబాబు ఆటోలో వెనక కూర్చుని మాత్రమే ప్రయాణం చేశారు. ఈ విషయం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది.

జగన్ సంగతేంటి?
గతంలో జగన్ ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణించిన కొన్ని వీడియోలను, ఫొటోలను నెటిజన్లు బయటకు తీశారు. పోలీస్ కేస్ పెట్టాలంటే ముందు జగన్ పై పెట్టాలి కదా అని ప్రశ్నించారు. చట్టాలు మీకు కూడా వర్తిస్తాయి కదా అని నిలదీశారు. జగన్ పై కేసు పెట్టాల్సిందేనంటూ ఏపీ పోలీస్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు మొదలయ్యాయి. దీంతో వైసీపీ సైలెంట్ అయింది. చంద్రబాబుని టార్గెట్ చేయాలని ట్వీట్ వేసి, జగన్ ని ఇరికించేశారంటూ కౌంటర్లిస్తున్నారు. ఇప్పుడే కాదు, వైసీపీ ఎప్పుడూ ఇలాగే ఇరుక్కుపోతుందని అంటున్నారు. చంద్రబాబుని ఇరికించాలనుకున్న ప్రతిసారీ దొరికిపోవడం వైసీపీకి ఆనవాయితీగా మారిందని సెటైర్లు పేలుస్తున్నారు. చంద్రబాబుని టార్గెట్ చేసిన సదరు వైసీపీ నేతకి సొంత పార్టీ వాళ్లే చే చురకలంటిస్తున్నారు. విమర్శలు చేసేముందు అసలు అక్కడ ఏం జరిగిందో చూసుకోవాలి కదా అంటున్నారు. బురదజల్లడం ఒక్కటే పనిగా పెట్టుకుంటే, చివరకు ఇలా నవ్వులపాలు కావాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తమ్మీద చంద్రబాబుకి కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేసి, జగన్ చేసిన తప్పుల్ని వైసీపీ బయటపెట్టినట్టయింది.

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×