BigTV English

AP: వైసీపీ ‘గృహ సారథులు’కు కౌంటర్ గా టీడీపీ ‘సాధికార సారథులు’.. ఏపీలో నెట్ వర్క్ పాలిటిక్స్..

AP: వైసీపీ ‘గృహ సారథులు’కు కౌంటర్ గా టీడీపీ ‘సాధికార సారథులు’.. ఏపీలో నెట్ వర్క్ పాలిటిక్స్..

AP: 2024 కోసం వైసీపీ దూకుడుగా వెళ్తోంది. అసలే అధికార పార్టీ.. చేతిలో అన్ని వనరులు అందుబాటులో ఉంటాయి. అయినా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా గడప గడపకూ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తోంది. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల రూపంలో 5.65 లక్షలమందితో వైసీపీకి విస్తృత నెట్ వర్క్ ఏర్పాటు చేశారు. జగనన్నే మా భవిష్యత్తు.. అంటూ సుమారు 1.65 కోట్ల గృహాలను చుట్టేసే కార్యక్రమం చేపడుతున్నారు.


వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ సైతం రాజకీయ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. అటు, టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. సైకో జనగ్ పాలన పోవాలని.. సైకిల్ పాలన రావాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు.

ఇక, వైసీపీ తీసుకొచ్చిన ‘గృహ సారథులు’కు కౌంటర్ గా టీడీపీలో ‘సాధికార సారథులు’ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒకరు చొప్పున.. సాధికార సారథులను నియమిస్తున్నట్టు చెప్పారు.


పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని.. ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌లు అందరినీ ‘కుటుంబ సాధికార సారథులు’గా పిలుస్తామని ప్రకటించారు.

కార్యకర్తల ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని చంద్రబాబు వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.

ఇలా, వచ్చే ఎన్నికలకు వైసీపీ, టీడీపీ పోటాపోటీగా కార్యకర్తల నెట్ వర్క్ ఏర్పాటు చేస్తుండటంతో ఈసారి పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×