Moringa Seeds: మునగ ఆకులలో పాటు..గింజలలో ఉండే పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తి, గుండె, జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రస్తుతం మునగ విత్తనాల గురించి చర్చ వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మునగ గింజలు విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని అలాగే గుండెకు మేలు చేస్తాయి .
మునగ విత్తనాలు ఎందుకు ప్రత్యేకమైనవి ?
రోగనిరోధక శక్తిని పెంచేవి: వీటిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
జీర్ణవ్యవస్థకు మీలు : వీటిని సాధారణ పరిమాణంలో తీసుకుంటే.. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మునగ గింజలు తరచుగా తీసుకోవడం వల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు తొలగి పోతాయి.
గుండెకు మేలు : ఈ విత్తనాలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ప్రోటీన్ యొక్క మూలం: మునగ గింజలు 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న కొన్ని మొక్కల వనరులలో ఒకటి. ఇది కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్ రక్షణ: ఈ విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తాయి.
Also Read: కరివేపాకులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
జాగ్రత్త కూడా అవసరం:
ఆరోగ్య , ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మునగ గింజలను అధికంగా తీసుకోవడం హానికరం. ముఖ్యంగా జీర్ణ సమస్యలు. తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా ప్రత్యేకమైన ఔషధం తీసుకుంటున్నవారు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ , పాలిచ్చే స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వీటిని’ తీసుకోవాలి.
మునగ విత్తనాలను ఎలా ఉపయోగించాలి ?
మీరు మునగ గింజలను పొడి, గుళికలు లేదా నూనె రూపంలో కూడా తీసుకోవచ్చు. దీనిని స్మూతీలు, పెరుగు లేదా సలాడ్లలో కలిపి తినవచ్చు. కానీ ప్రారంభంలో తక్కువ పరిమాణంలో ప్రారంభించి నెమ్మదిగా పెంచండి.