BigTV English

AP News : గుడిలో రెడ్డి.. అసెంబ్లీ రౌడీ సినిమా స్టైల్‌లో దోపిడీ

AP News : గుడిలో రెడ్డి.. అసెంబ్లీ రౌడీ సినిమా స్టైల్‌లో దోపిడీ

AP News : ఆలయం అంటే పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. గుడి లోపలే కాదు.. గుడి బయట కూడా దేవుడే కనిపించాలి. కానీ, ఈ మధ్య కాలంలో టెంపుల్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. ఫ్లెక్సీలు గట్రా పద్దతీ పాడు లేకుండా పోయాయి. అది వేరే మేటర్. ఇప్పుడు చెప్పబోయేది చాలా డిఫరెంట్. అది ఏపీలో చాలా ఫేమస్ టెంపుల్. ప్రతీరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. అంతటి పాపులర్ గుడి ప్రాంతాన్ని ఓ పొలిటికల్ లీడర్ కబ్జా చేసేశాడు. కబ్జా అంటే భూకబ్జా కాదు. బిజినెస్ కబ్జా. అక్కడ ఏ దందా అయినా అతని కనుసన్నల్లో జరగాల్సిందే. పార్కింగ్ నుంచి దేవుడి బొమ్మలు అమ్మే షాప్ వరకూ.. అంతా అతని కంట్రోల్‌లోనే. అందుకే, అక్కడ ఎటూ చూసినా అతని ఫోటోలే. ఏడాదికి సుమారు 5 కోట్లకు పైగా దోపిడీ దందా చేస్తున్నాడట ఆ వైసీపీ లీడర్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా దందా?


తిరుచానూరులో అసెంబ్లీ రౌడీ తరహా సీన్

అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తుందా? ఓ టౌన్‌లో ప్రతి షాప్ పేరు బాషా అని ఉంటుంది. బాషా పాన్‌షాప్, బాషా కిరాణం షాప్, బాషా చికెన్ సెంటర్.. ఇలా. ఆ సీన్‌కు ఏమాత్రం తీసిపోని.. రియల్ సీన్ ఏపీలో జరుగుతోంది. తిరుమల తర్వాత శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా దర్శనానికి వెళ్లే తిరుచానూరులో ఈ దారుణం చూడొచ్చు. షాప్ పేరు కాదు కానీ.. దాదాపు ప్రతి షాప్ బోర్టుపై ఓ వైసీపీ నాయకుడి ఫోటో ఉంటుంది. అతనే రామచంద్రారెడ్డి. లోకల్ సర్పంచ్.


చేతిలో పవర్.. చేతినిండా పైసా వసూల్

వరుసగా సర్పంచ్ గిరీ వెలగబెడుతున్న రామచంద్రారెడ్డి అనే నాయకుడు నియంతలా తయారయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఇక్కడ దుకాణాలు, దందాలన్నీ ఆయనవే. కన్ను పడిన భూములన్నీ ఆయనవే అని ఆరోపణలున్నాయి. సుదీర్ఘకాలం పనిచేసిన ఆలయ ఈవో కూడా చెయ్యి కలిపి అడ్డగోలుగా దందాలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడిటింగ్ కూడా నామమాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. రాష్టంలో అధికారం ఎవ్వరిదైనా.. తిరుచానూరులో పెత్తనం మాత్రం వీళ్లదే అంటున్నారు.

Also Read : విమానం నడిపిన కేతిరెడ్డి.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..

కోట్లలో దందాలు.. అడ్డుకునే వారెవరు?

అమ్మవారి ఆలయానికి, పోలీస్ స్టేషన్‌కు తప్ప.. అన్ని దుకాణాలకు కచ్చితంగా అయ్యగారి ఫోటో పెట్టుకోవాలనే హుకుం జారీ చేశారట. ఇష్టమున్నా, లేకపోయినా దుకాణాలకు రామచంద్రారెడ్డి ఫోటో కనిపిస్తుంది. చివరకు ఆర్టీసి బస్టాప్‌ను కూడా అనధికారికంగా అద్దెకు ఇచ్చారని చెప్తున్నారు. ఎవరైనా ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా.. ఈయన అనుమతి ఉండాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా వాహనాల పార్కింగ్ టెండర్ పేరుతో అడ్డగోలుగా దందాలు నిర్వహించారు. ఒక్క వాహనాల పార్కింగ్ టెండర్ ద్వారానే ఏకంగా 3, 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి ప్రతిరోజు 30, 40 వేల మంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత అధిక ఆదాయం ఉన్న పంచాయతీ కూడా తిరుచానూరుగా చెప్తారు. ఆ ఆదాయానికి సర్పంచ్ రామచంద్రారెడ్డి వల్ల భారీ నష్టం వస్తోందని స్థానికుల ఆరోపణ. ఆలయం చుట్టూ దందాలతో తన వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడంలోనే సర్పంచ్ బిజీగా ఉంటారని.. మిగతా విషయాలేవీ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుచానూరు సర్పంచ్‌ రామచంద్రారెడ్డిపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

tiruchanur sarpanch

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×