BigTV English

Telugu Hero : సినిమాలో ఎనర్జీ తగ్గింది… రెమ్యునరేషనే కావాలంటూ హీరో యూటర్న్..?

Telugu Hero : సినిమాలో ఎనర్జీ తగ్గింది… రెమ్యునరేషనే కావాలంటూ హీరో యూటర్న్..?

Telugu Hero : ఏది ఏమైనా… ఏం జరిగినా… హీరోలకు రెమ్యునరేషన్ అనేది చాలా ముఖ్యం. అది ఏ రూపంలో వస్తుంది అనేది పక్కన పెడితే… ఎంత మోతాదులో వస్తుంది అనేదే వాళ్లకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సినిమాలకు నష్టాలు వస్తే, తీసుకున్న రెమ్యునరేషన్‌లో కొంత మేర తిరిగిచ్చే మంచి హీరోలు అక్కడక్కడ ఉన్నట్టు… ఇలాంటి హీరోలు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో…


ఎలాంటి హీరోలు అంటే…
ఎలా చేస్తే… ఏం చేస్తే నిర్మాతల నుంచి ఎక్కువ డబ్బులు రాబట్టొచ్చు అని థింక్ చేసే హీరోలు. అవును అండి. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఓ హీరో గురించే ఇప్పుడు చూద్దాం…

ఇండస్ట్రీలో చుట్టాలు ఉండటంతో అలా ఎంట్రీ ఇచ్చి… హీరో అయ్యాడు ఓ అబ్బాయి. కిందా మీద పడుతూ… సినిమాలు చేస్తూ… కొన్ని సార్లు సక్సెస్… అంతకు మించి చాలా సార్లు వరుస డిజాస్టర్లు అందుకుంటూ టైర్ 2 హీరోల్లో తాను కూడా ఒకడిని ఉన్నాను అని చెప్పుకోలేక… చెప్పుకుంటూ… సినిమాలు చేస్తున్నాడు ఆ హీరో.


కొన్నేళ్ల కిందట ఓ సినిమా హిట్ అయింది. దీని తర్వాత 4 సినిమాలు చేశాడు. అన్నీ డిజాస్టర్లే. అసలు ఈ హీరో గురించి ఆలోంచిచండమే మానేశారు కొంత మంది అయితే. చివరి సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆ హీరో. పెద్ద డైరెక్టర్ కావడం, ఆయనతో గతంలో సినిమాలు చేయడంతో… హిట్… కాదు కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు. కానీ, ఎప్పటిలానే.. అది కూడా డిజాస్టర్.

నాకు రెమ్యునరేషన్ వద్దు…?

ఇప్పుడు ఆ హీరో… ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆయన ఓ హిట్ మూవీ ఇచ్చిన అనుభవం కూడా ఉంది. దీంతో ఆయనకు కూడా హిట్ వస్తుందని పక్కాగా నమ్మాడు.

రెమ్యునరేషన్ వద్దు… కానీ, నైజాం, గుంటూరు థియేట్రికల్ రైట్స్ ఇవ్వండి అని మాత్రం అన్నాడట. హీరో గారు అడగడంతో… ఆ నిర్మాతలు సరే లేండి అని అనేశారు. హీరో ఫిక్సిడ్ రెమ్యునరేషన్ కాకుండా… థియేట్రికల్ రైట్స్ అడగడం ఏంటంటే…? సినిమా స్టోరీపై హీరో గారికి చాలా నమ్మకం ఉందంట. డైరెక్టర్ పై కూడా అదే నమ్మకమట.

దీంతో రెమ్యునరేషన్ కంటే… నైజాం, గుంటూరు థియేట్రికల్ రైట్స్ అంటే… చేతికి వచ్చే డబ్బు ఎక్కువే అని ఆలోచించి… అలా నిర్మాతలకు చెప్పాడట.

తూచ్… నాకు రెమ్యునరేషనే కావాలి..?

ఇలా హీరో అనడం… దానికి నిర్మాతలకు ఒప్పుకోవడం… షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యే వరకు అవ్వడం… ఇలా జరుగుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో హీరో ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చూశాడట. సినిమా నచ్చలేదట. స్టోరీ నచ్చలేదట. డైరెక్షన్ నచ్చలేదట. ఇలాంటి సినిమాకు ఆడియన్స్ థియేటర్స్ లో అడుగు పెట్టడం కష్టమే అంటూ పునరాలోచనలో పడ్డాడట.

ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ను నమ్ముకుంటే… వచ్చే డబ్బు చాలా తక్కువ.. నష్టం జరిగే అవకాశం ఉందని… అనుకున్నాడట. వెంటనే నిర్మాతల దగ్గరకు వెళ్లి… థియేట్రికల్ రైట్స్ మీరు ఉంచుకోండి… నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అని కూర్చున్నాడట.

దీంతో ఇప్పటికే అన్నీ సెట్ చేసుకున్న నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. ఈ విషయం బయటికి రావడంతో… ఈ హీరో గారు ఏంటి… ఒక మాటపైన ఉండడ..? ఇంత సడన్‌గా రెమ్యునరేషన్ అని ప్లేట్ మార్చడానికి కారణం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×