BigTV English
Advertisement

Kadapa Land Grabbing: కడప జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.. వైసీపీ నేతల చేతుల్లో పేదల భూములు!

Kadapa Land Grabbing: కడప జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.. వైసీపీ నేతల చేతుల్లో పేదల భూములు!

Kadapa Land Grabbing| మన ప్రభుత్వం, మన జిల్లా.. మనకు ఎదురేముందన్నట్లు కడప జిల్లాలో ప్రభుత్వ భూముల అడ్డగోలుగా ఆక్రమించుకున్నారు వైసీపీ నేతలు .. సిబ్బందిపై వత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు …. ఇప్పుడు కలెక్టర్‌ శివశంకర్ ఆ భాగోతాలన్నీ బయటకు తీస్తున్నారు .. అక్రమాలు గుర్తించిన చోట అధికారులు, సిబ్బందికి నోటీసులు ఇస్తూ.. ప్రభుత్వ భూముల రెజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నారు … దాంతో జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడిన అధికారులు, సిబ్బందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట.


కడప జిల్లాలో గత అయిదేళ్లు యథేచ్ఛగా భూకబ్జాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి .. వైసీపీ నేతలు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు… సదరు రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ శివశంకర్ కొరడా ఝులిపిస్తుండటంతో… వైసీపీ నేతలతో పాటు సహకరించిన సిబ్బంది సైతం వణికిపోతున్నారు … జమ్మలమడుగు డివిజన్ పరిధిలో 57 రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయట … ఇటీవల మైదుకూరు తహశీల్దారు కార్యాలయం పరిధిలో దాదాపు 500 ఎకరాలకు పైగా భూములను నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతం చేశారనే నిర్ధారణకు వచ్చి అప్పటి తహశీల్దారు అనురాధ సహా మరో 10 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు … కలెక్టర్ తీసుకుంటున్న చర్యలతో ఇజగన్ సర్కారులో చేసిన తప్పిదాలు బయట పడితే సస్పెన్షన్లు తప్పవంటూ అధికారులు ఆందోళన చెందుతున్నారట.

Also Read: బాలయ్య Vs జగన్.. ప్రతిష్టాత్మకంగా మారిన హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పోరు


మరో వైపు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మృణాళినిదేవి ముద్దనూరు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములపై 57 రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా జిల్లా రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ బృందం చేసిన విచారణలో బట్టబయలైంది . ఈ మేరకు సమగ్ర విచారణ నివేదికను కలెక్టర్ కు జిల్లా రిజిస్ట్రార్ అందజేశారు .సదరు నివేదికను పరిశీలించిన కలెక్టర్ ముద్దనూరు మండలంలో 53, జమ్మలమడు గులో ఒక్కటి. ఎర్రగుంట్ల మండలంలో మూడు వెరసి మొత్తం 57 రిజిస్ట్రేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు నిర్ధారించి … .ఏపీ రిజిస్ట్రేషన్ యాక్టు 1908 ప్రకారం 37 రిజిస్ట్రేషన్లు తక్షణమే రద్దు చేశారు..

జగన్ పాలనలో పేదల భూములు అడ్డగోలుగా పెద్దలు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ..అధికారం చేతిలో ఉంది కదా అని, పేదల జీవనాధారానికి ఇచ్చిన డీకేటీ భూములను కూడా పార్టీ నేతలు వదల్లేదు … రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల అధికారులను ప్రలోభపెట్టి ఇష్టారాజ్యం గా జిల్లాలో పేదల, ప్రభుత్వ భూముల ను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. .. వాటిని తాకట్టు పెట్టి దర్జాగా బ్యాంకు రుణాలు పొందారు.. కొందరైతే పట్టణ ప్రాంతాలకు సమీప భూముల్లో రియల్ ఎస్టేట్ దందాలు నడిపించి కోట్లు దండుకున్నారు.. అలాంటి భూముల వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లాలో ఇటీవల మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారం బయట పడడంతో జగన్ హయాంలో జిల్లాలో పని చేసిన తహశీల్దార్లు, సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయట … జగన్ సర్కారు వ్యూహాత్మకంగా తెచ్చిన 506 జీవో ద్వారా పేదలకు అమ్ముకునే హక్కు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.. దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు భూములు కొట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటమరో నెలకు జీఓ వస్తోందనగానే ప్రజా ప్రతినిధులకు.. రెవెన్యూ శాఖలకు గుట్టుగా సమాచారం చేరడంతో వ్యూహాత్మకంగా పేదల భూములకు పదోపరకో ఆశ చూపి జిల్లాలో అడ్డగోలుగా దోచుకున్నారట… ఇది కడప జిల్లాకే పరిమితం కాలేదు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి పేదల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.. అధికారంలోకి రాగానే కూటమి సర్కారు ప్రభుత్వ భూముల ఆక్రమ రిజిస్ట్రేషన్లు అన్యాకాంతంపై గురిపెట్టారు. వెంటనే జగన్ సర్కారులో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చి పేదలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టారట.

జిల్లా వ్యాప్తంగా 76,276 ఎకరాల భూములకు ఫ్రీహోల్డ్ కల్పిస్తూ రెవెన్యూ సిబ్బంది చేసిన నిర్వాకాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తుంది… జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో సగటున 24 వేల ప్రభుత్వ భూములకు ఫ్రీహోల్డ్ కల్పించేందుకు రెవెన్యూ శాఖ జాబితా మండలాల వారీగా సిద్ధం చేసిందట. జమ్మలమడుగు మండలంలో 25,307 ఎకరాలు, బద్వేలంలో 16,388 ఎకరాలు, కడపలో 10,755 ఎకరాలు, పులివెందుల డివిజనల్ 23,734 ఎకరాల ఫ్రీహోల్డ్ భూములున్నాయట. ఇప్పటికే జిల్లాలో మైదుకూరు మండలంలో అవకతవకలు జరగడం, ఇదే తరహాలో మిగతా మండలాల్లో ఫ్రీహోల్డ్ భూముల ఆక్రమాలు గుట్టురట్టయితే రెవెన్యూ.. రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులకు పెద్ద ఎత్తున వేటుపడడం ఖాయమంటున్నారు.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×