వైసీపీ ఘోర పరాభవం తర్వాత నేతలు కాస్త కంట్రోల్ లోకి వచ్చారు. ఎన్నికల ముందు ఉన్న బూతు పంచాంగానికి కొన్నిరోజులు బ్రేక్ పడంది. అయితే ఆ బ్రేక్ తాత్కాలికం. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది గడచిపోయిన తర్వాత తిరిగి వైసీపీలో జోష్ పెరిగినట్టు కనపడుతోంది. ఆ జోష్ ప్రజాస్పందన విషయంలో కాదు, తిట్ల విషయంలో. అవును నిన్న రోజా, నేడు లక్ష్మీపార్వతి.. వీళ్ల మాటలు విన్నారా, ఆ టోన్ గమనించారా..? కచ్చితంగా ఎన్నికల ముందు ఉన్న పరిస్థితి రిపీట్ అవుతోంది. పవన్ కల్యాణ్, లోకేష్ పై దారుణ వ్యాఖ్యలు మొదలయ్యాయి. మొహానికి రంగులేసుకుంటున్నారని, రబ్బర్ సింగ్ అని.. పాత మాటలన్నీ మళ్లీ బయటకొస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత చాన్నాళ్ల వరకు మాజీ మంత్రి రోజా లైమ్ లైట్ లో లేరు. పార్టీ తరపున చేపట్టిన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. సొంత నియోజకవర్గంలో వర్గపోరుతో ఆమె సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ఆమె, భాష విషయంలో దూకుడు తగ్గించారు. అది కూడా కొన్నాళ్లే, మళ్లీ ఇప్పుడు పాతపద్ధతికి వచ్చేశారు. వెంట్రుక పీకలేరు, గేటు తాకలేరంటూ గతంలో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా, తిరిగి రబ్బర్ సింగ్ అంటూ డిప్యూటీ సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో రోజా మాటలు తిరిగి పాత స్థాయికి చేరుకుంటాయనడంలో అనుమానం ఏమీ లేదు.
పవన్ కళ్యాణ్ సెలూన్ షాప్,….కడపలో చెప్పులు షాప్
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ పరిశ్రమలు
-రోజా pic.twitter.com/JdNN7hmMQN
— Rahul (@2024YCP) June 23, 2025
రోజా తర్వాత లక్ష్మీపార్వతి కూడా స్వరం మార్చారు. గతంలో చంద్రబాబు, లోకేష్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చారు. వైసీపీలో ఒకరిని చూసి ఇంకొకరు ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు సిద్ధమవడం ఇక్కడ విశేషం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు పాలన ఇదేనా అని అడిగారు లక్ష్మీపార్వతి. లోకేష్ ని షాడో సీఎంగా అభివర్ణించారు. చంద్రబాబు అసమర్థుడిలాగా మూలన కూర్చున్నారని, పాలన అంతా లోకేష్ చేస్తున్నారని విమర్శించారు లక్ష్మీపార్వతి. లోకేష్ ని వాడు, వీడు అంటూ సంబోధించారు. ఆయనకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, పోలీసుల పేరు చెప్పి ప్రజల్ని, నాయకుల్ని భయపెడుతున్నారని మండిపడ్డారు.
EVM సాయంతో వచ్చిన దరిద్రపు పరిపాలన..
-లక్ష్మీ పార్వతి pic.twitter.com/f2IEbGqIs8
— Rahul (@2024YCP) June 24, 2025
మూడో ఆయన..
ఇక మూడో ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోలేమని, ఆయన ఒక వేస్ట్ ఫెలో అంటూ పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. సనాతన వేషం వేసుకుని ఆయన రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆదేశించినప్పుడల్లా వచ్చి జగన్ ని తిట్టి వెళ్లడానికే పవన్ పరిమితం అయ్యారని విమర్శించారామె.
ఇటీవల కోర్టుల్లో ఊరట లభించడంతో మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్వరం పెంచారు. ఏపీలో హోం శాఖ లేదని, అది జగన్ ని తిట్టే శాఖ అని మండిపడ్డారు నాని. హోం మంత్రి అనితపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె మహానటి అంటూ వెటకారం చేశారు.
మొదలెట్టండి మహానటి గారు…
-లైవ్ లో వంగలపూడి అనిత బొమ్మేసి ఏకిపారేసిన పేర్ని నాని pic.twitter.com/wywJ7X8IzD
— Rahul (@2024YCP) June 24, 2025
మొత్తమ్మీద ఏడాది తర్వాత వైసీపీ స్వరం మారింది. గతంలో మాదిరిగానే నేతల్ని టార్గెట్ చేసుకుని మరీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ముందు వైసీపీకి అలవాటైన బూతులు కూడా మళ్లీ వినాల్సి వస్తుందేమోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.