BigTV English

Aloevera Beauty Tips: వర్షాకాలంలో తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

Aloevera Beauty Tips: వర్షాకాలంలో తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

Aloevera Beauty Tips: వర్షాకాలంలో తేమ, చర్మం జిడ్డుగా ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. చెమటలో జిడ్డు చర్మంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలంలో చర్మంపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటప్పుడు రోజూ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చర్మం అందంతోపాటు ముఖం మెరిసిపోతుంది. ఈ క్రమంలో అలోవెరా జెల్ ఒక గొప్ప ఎంపిక. కలబందలో సహజంగా ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. ఈ అలోవెరా జెల్ మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.


అలోవెరా జెల్ ప్రయోజనాలు:
అలోవెరా జెల్‌లో 96% నీటిని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది వాపు, ఎరుపును తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని చల్లబరుస్తుంది, చికాకును తగ్గిస్తుంది. అలోవెరా జెల్ మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మచ్చలను తగ్గిస్తుంది.

అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్స్:


బొప్పాయి, రోజ్ వాటర్, అలోవెరా జెల్ ఫేస్‌ప్యాక్:
చర్మాన్ని అందంగా చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరానికి ప్రోటిన్లను కూడా అందజేస్తాయి. చర్మ సౌంద్యం కోసం ఫేస్‌ ఫ్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో తగినంత రోజ్ వాటర్ వేసి..అందులో అలోవెరా జెల్‌ను మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే చాలు ముఖం తాజాగా కనిపిస్తుంది.

అలోవెరా జెల్, తేనె ఫేస్‌ప్యాక్:
ముఖం ఎల్లపుడు మెరవడానికి కలబంద, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా తాజా అలోవెరా జెల్‌ను చిటికెడు పసుపుతో కలిపి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్‌ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముడతల గల చర్మాన్ని తగ్గిస్తుంది.

కలబందతో చేసిన ప్యాక్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇతర చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని నిపుణలు తెలుపుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.

అలోవెరా, పెరుగు ఫేస్ మాస్క్:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని టోన్ చేసి కాంతివంతం చేస్తుంది.

అలోవెరా, ఓట్స్ ఫేస్ మాస్క్:
ఓట్స్ చర్మాన్ని ఉపశమనం చేస్తాయి.. మంటను తగ్గిస్తాయి. ఈ ఫేస్ మాస్క్ సున్నితమైన చర్మానికి చాలా మంచిది.

Also Read: పూజలకు, పండుగలకు మామిడి ఆకు ఉండాల్సిందే.. దాని స్పెషల్ ఎంటో తెలుసా..?

ఫేస్ మాస్క్ ఎలా అప్లై చేయాలి..?
ముందుగా ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి.
తర్వాత ఫేస్ మాస్క్‌ను ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి.
దీని తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.
మీరు ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.

Related News

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Big Stories

×