Indian Railways: భారతీయ రైల్వే టికెట్ ధరలను స్వల్పంగా పెంచనున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమలు కానున్నట్లు సమాచారం. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల టికెట్ ధర కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున పెంచనున్నట్లు తెలుస్తోంది. అటు ఏసీ క్లాస్ కు సంబంధించి ధర కిలో మీటర్ కు రెండు పైసల చొప్పున పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రైల్వే టికెట్ ధరల పెంపుపై రైల్వే నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత టికెట్ల ధరలను సవరిస్తోంది రైల్వేశాఖ.
జులై 1 నుంచి అమల్లోకి కొత్త ధరలు
అటు సబర్బన్ టికెట్ ధరల విషయానికి వస్తే, 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జులై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అటు నెలవారీ సీజన్ టికెట్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
తత్కాల్ బుకింగ్ కు ఆధార్ ప్రమాణీకరణ
అటు జులై 1 నుంచి IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో ఈ అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. జూలై 15 నుంచి, రిజర్వేషన్ కౌంటర్లలో, అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టికెట్లకు ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. “తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో వినియోగదారులు అందించిన మొబైల్ నంబర్ తో సిస్టమ్-జనరేటెడ్ OTP ప్రామాణీకరణ తర్వాత మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. బుకింగ్ సమయంలో వినియోగదారులు అందించిన మొబైల్ నంబర్ లోని సిస్టమ్ ద్వారా పంపబడుతుంది” అని రైల్వేశాఖ వెల్లడించింది.
Read Also: గోవాకు RoRo రైల్.. ఇక కారుతోపాటు రైలు ఎక్కేయొచ్చు, ఇదిగో ఇలా!
ఆధార్ ప్రామాణీకరణతో లాభం ఏంటి?
కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నిజమైన ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చేలా సాయపడనుంది. దీనిలో భాగంగా బుకింగ్ విండోలోని ఉదయం 10 నుండి 10.30 గంటల మధ్య AC తరగతులకు, ఉదయం 11 నుండి 11.30 గంటల మధ్య నాన్-AC తరగతులకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి 10 నిమిషాలలో అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోకుండా పరిమితం చేయబడుతారు. ఈ విధానం ద్వారా తత్కాల్ టికెట్లు నిజమైన లబ్దిదారులకే దక్కనున్నాయి.
Read Also:ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!