BigTV English

Adimulam : వైసీపీలో ఎస్సీలకు విలువలేదు.. ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు..

Adimulam : వైసీపీలో ఎస్సీలకు విలువలేదు.. ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు..

Adimulam : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీలో అసమ్మతి నేతలు అధిష్టానంపై తిరుగుబాటుకు దిగుతున్నారు. ఈ క్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం మంత్రి ఇంట్లో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం గురించి కనీసం మాటైనా చెప్పాల్సిన అవసరం లేదా? అని ఆదిమూలం నిలదీశారు.


పెద్దిరెడ్డికి దమ్ముంటే తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల మీటింగ్‌ తన ఇంట్లో పెట్టగలరా అని సవాల్ చేశారు. తనకు ఇష్టం లేకుండా తిరుపతి ఎంపీ స్థానానికి ఇంఛార్జ్ గా ప్రకటించారని మండిపడ్డారు. సత్యవేడు నుంచి తనను తప్పించడం వెనక పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. 1989లో మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డి వందల కోట్లు ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి గత ఆస్తుల గురించి చెబుతారన్నారు.

సత్యవేడులో మంత్రిపెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆదిమూలం ఆరోపించారు. ఆ అక్రమాలను తనపై నెట్టేశారని తెలిపారు. ఇలా నియోజకవర్గం నుంచి తప్పించారని మండిపడ్డారు.
తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా చేసింది పెద్దిరెడ్డే అని స్పష్టంచేశారు. ఇటీవల సీఎం జగన్ తన పిలిపి ఎంపీగా పోటీ చేయాలని కోరారని వెల్లడించారు. తానేం తప్పు చేశానని ఎంపీగా ఎందుకు పంపుతున్నారని అడిగానని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోవడానికి 2 కారణాలు చెప్పాలని అడిగానన్నారు.


రాష్ట్రంలోని 175 స్థానాల్లో సత్యవేడు నియోజకవర్గమే ప్రశాంతంగా ఉందని ఆదిమూలం అన్నారు. అధికార, విపక్ష నాయకులు ఎవరిపైనా కేసులు నమోదు కాలేదన్నారు. ఎవరిపై ఫిర్యాదులు వచ్చినా డీఐజీతో చెప్పి రాజీ చేయించానని వివరించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×