BigTV English

Nitish Kumar : బిహార్‌లో కొత్త ప్రభుత్వం.. ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం..

Nitish Kumar : బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన అభ్యర్థనకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్రను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. దీంతో గవర్నర్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించారు. నీతీశ్‌ వెంట బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్‌ చౌధరీ ఇతర నేతలు ఉన్నారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కొత్త కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సాయంత్రం 4.15కు పట్నాకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రిగా నీతీశ్‌తోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ జాబితాలో బీజేపీ నుంచి సామ్రాట్‌ చౌధరీ, డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, విజయ్‌ సిన్హా, జేడీయూ నుంచి శ్రవణ్‌ కుమార్‌, హెచ్‌ఏఎం తరఫున సంతోష్‌ సుమన్‌, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌ సింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ తీరును జేడీయూ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ డిసెంబర్‌ 19న అశోకా హోటల్‌లో జరిగిన సమావేశంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఇండియా కూటమిని హైజాక్‌ చేయడానికి ప్రయత్నించారన్నారు. దీనిలో భాగంగానే నాయకత్వ బాధ్యతలను ఖర్గేకు కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు.

ముంబయిలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కూటమి నాయకత్వం ఎవరికీ ఇవ్వకుండానే సమష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్లు త్యాగి తెలిపారు. కానీ, అశోకా హోటల్‌లో టీఎంసీ నేత మమతా బెనర్జీతో కలిసి ఖర్గే పేరును తెరపైకి తెచ్చిందన్నారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలని ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక నీతీశ్‌ రాజీనామాపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. చెత్త తిరిగి చెత్తకుండీలోకి చేరిందని విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×