BigTV English

Pithapuram | పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు అసంతృప్తి .. అయోమయంలో వంగా గీత!

Pithapuram | వైసీపీలో ఇంఛార్జిల మార్పు వ్యవహారంతో కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతని ఇంచార్జిగా ప్రకటించారు జగన్. దాంతో దొరబాబుని కాదనుకోలేక .. వంగా గీతకు స్వాగతం పలకలేక పిఠాపురం వైసీపీ శ్రేణుల్లో ఆయోమయం కనిపిస్తోంది.

Pithapuram | పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు అసంతృప్తి .. అయోమయంలో వంగా గీత!

Pithapuram | వైసీపీలో ఇంఛార్జిల మార్పు వ్యవహారంతో కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతని ఇంచార్జిగా ప్రకటించారు జగన్. దాంతో దొరబాబుని కాదనుకోలేక .. వంగా గీతకు స్వాగతం పలకలేక పిఠాపురం వైసీపీ శ్రేణుల్లో ఆయోమయం కనిపిస్తోంది. కేడర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటుండంతో ఎంపీగా ఉండి కూడా వంగా గీత ఇంతవరకు పిఠాపురంలో పార్టీ కోఆర్డినేటర్‌గా తన కార్యాలయం ప్రారంభించలేకపోయారు.


కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీలో తీవ్రగందరగోళం నెలకొంది. అక్కడ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని కాదని .. కాకినాడ ఎంపీ వంగా గీతని ఇంచార్జిగా ప్రకటించారు వైసీపీ అధినేత జగన్.. దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే దొరబాబు పిఠాపురంను వదులుకోవడానికి సిద్దంగా లేరంట. దాంతో ఇంతకాలం ఎమ్మెల్యేగా తమకు అండదండలందించిన దొరబాబుని కాదనలేక .. కొత్త ఇంచార్జి వంగా గీతకు జై కొట్టలేక వైసీపీ శ్రేణుల్లో అయోమయం కనిపిస్తోంది .. ఎవరి పక్కన చేరితే ఏమవుతుందో అని పార్టీ కార్యక్రమాలకు దూరంగా కేడర్ ఉండిపోతోంది.

పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా వంగ గీతని ప్రకటించినప్పటికీ .. ఇప్పటికీ ఆమె కార్యాలయాన్ని ప్రారంభించలేకపోయారు. కనీసం కార్యకర్తల సమావేశం జరపలేని స్థితిలో ఉన్నారు. దాంతో దొరబాబు తనకు పార్టీ క్యాడర్ని కలిసే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆమె అక్కడ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది పరిస్థితి.


దొరబాబుతో వై.వి. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు చర్చలు జరుపుతూ జగన్ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేలా ప్రయత్నం చేస్తున్నారంట. పిఠాపురంలో వంగా గీత విజయానికి సహకరిస్తే భవిష్యత్తులో మంచి పోజిషన్ ఇస్తామని హామీలు ఇస్తున్నారంట. అదలా ఉంటే పార్టీలకతీతంగా పిఠాపురంలో దొరబాబుకు పట్టు ఉందని ఇతర పార్టీల నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ప్రజల్లో పట్టు ఉన్న నాయకుడిని వదులుకుంటూ వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటుందంటున్నారు.

ఆ క్రమంలో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు దొరబాబు. అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో దొరబాబు బలప్రదర్శనకు ఈ కార్యక్రమం వేదికైందనే చర్చ సాగింది. ఆ విందు సందర్భంగా పిఠాపురం సీటుపై సీఎం జగన్‌ పునరాలోచించాలని .. నియోజకవర్గంపై తనకే ఎక్కువ పట్టుందని.. అందుకే వేలాది మంది తన పుట్టిన రోజు వేడుకలకు తరలివచ్చారని.. పిఠాపురం టికెట్‌ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారాయన. అంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలుకు దూరంగా ఉంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు.

ఈ నెల 12న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన దొరబాబు.. అప్పటి నుంచి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఆ తర్వాత సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అయితే, మరోసారి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఆ దిశగా ప్రత్యామ్నాయ ఆప్షన్స్ పై దృష్టి పెట్టారా? అనే చర్చ సాగుతోంది. అందులో భాగంగానే ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారట దొరబాబు.. అనుచరుల సూచనల మేరకు పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న దొరబాబు.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు.. ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి సీఎంవో నుంచి ఫోన్‌ వచ్చినట్టు చెబుతున్నారు.. ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి సీఎంవోకి రావాలని దొరబాబుకి ఫోన్ వచ్చిందట.. మరోవైపు వంగా గీత తాడేపల్లిలోనే ఉన్నారు .. దొరబాబు సీఎంను కలిశాక తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

YSRCP MLA Dorababu, disgruntled, Party leadership, nervous, losing seat, Pithapuram,

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×