YSRCP latest updates(Political news in AP): సీఎం జగన్ చెప్పినా వినరా? వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమని చెప్తున్నా పట్టించుకోరా? ఆ 19 మంది ఎమ్మెల్యేల ధైర్యం ఏంటి? వైసీపీ అధినేత వార్నింగ్ ఇచ్చే వరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఇంతకీ వాళ్లెవరు? అంత వ్యతిరేకత ఎలా మూటగట్టుకున్నారు?
సొంతపార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం జగన్ నిఘా పెట్టారు. ఎమ్మెల్యేల పనితీరు.. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఆయా ఎమ్మెల్యేల జాబితాను తెప్పించుకున్నారు. 19 ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని గుర్తించారు అధినేత. గ్రాఫ్ బాలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని తేల్చేశారు.
జగన్ ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచీ ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరా? అనే ఆసక్తి పెరిగింది. జగన్ చెప్పినా గడప గడపకు తిరగని ఆ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ మొదలైంది. అంతా ఏకగ్రీవంగా చెబుతున్న పేరు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. మరి, మిగతా 18 మంది ఎవరు? వాళ్లంతా రెబెల్సా? లేదంటే, బద్దకస్తులా? గెలుపుపై ధీమా ఎక్కువగా ఉన్నవాళ్లా? ముందు టికెట్ వస్తేగా.. గెలిచేదో లేదో తెలిసేది. జగన్ టేబుల్ మీదున్న ఆ సర్వే రిపోర్టులోని పేర్లు.. బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.
ఆ 19మంది ఎమ్మెల్యేలు వీళ్లే:
మంగళగిరి– ఆళ్ల రామకృష్ణారెడ్డి
తిరుపతి– భూమన కరణాకరరెడ్డి
పొన్నూరు– కిలారు రోశయ్య
నందిగామ– మొండితోక జగన్మోహన్ రావు
దర్శి– మద్దిశెట్టి వేణుగోపాల్
సంతనూతలపాడు– సుధాకర్ బాబు
గూడూరు– వి.ప్రసాద రావు
పూతలపట్టు– ఎం.ఎస్.బాబు
బద్వేల్– దాసరి సుధ
కళ్యాణదుర్గం– ఉషశ్రీ చరణ్
పెనుగొండ– శంకర్ నారాయణ్
నందికొట్కూరు– టి.ఆర్థర్
ఆచంట– చెరుకువాడ శ్రీరంగనాథరాజు
చింతలపూడి– ఎలీషా
పత్తిపాడు– పి.పూర్ణచంద్రప్రసాద్
భీమిలి– అవంతి శ్రీనివాస్
బొబ్బిలి– అప్పల నాయుడు
రాజాం– కంబాల జోగులు
పాయకరావుపేట– గొల్ల బాబురావు