Mustafa Case: నూజివీడు పోలీస్టేషన్‌లో మాజీ ఎంఎల్ఏ ముస్తఫా పై అక్రమ కేసులు పెట్టారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలీసులు ఎఫ్ఐఅర్ ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదని, ఎంతో కాలంగా పొగాకు వ్యాపారం చేస్తున్నారు ముస్తాఫ్ తెలిపారని అన్నారు. అవకాశం వస్తే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని గాటుగా స్పందించారు. తమ్మినేని సీతారాం పై కూడా కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు. సిదిరి అప్పలరాజు పై అక్రమ కేసు బనాయించారని అన్నారు.
సూర్యచంద్రరావు పొగాకు వ్యాపారికి అడ్వాన్స్ ఇచ్చారని ముస్తఫా కుమారుడు తెలిపారని అన్నారు. తనకు సరుకు ఇవ్వడం లేదని పొగాకు లారిని అటకాయించారని అన్నారు. జిల్లాలోని కాకాని పోలిస్టేషన్‌కు సరుకు అప్పగిస్తే కిడ్నాప్ కేసు బనాయించారని తెలిపారు. న్యూస్ పేపర్లలో విభిన్నమైన పొంతన లేనూ కథనాలు ప్రచూరించారని, ముస్తాఫా సౌమ్యగా ఉండే వ్యక్తిని రౌడీగా చూపిస్తున్నారని అన్నారు.
Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. బొగత జలపాతం ఉగ్రరూపం, సందర్శన నిలిపివేత
కావాలనే అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబం పై కేసు బనాయించారని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీకి కాపులు వైసీపీ నాయకులతో కలవ కూడాదని ఫత్వా జారిచేస్తే సరిపోతుందని తెలిపారు. చంద్రబాబునాయుడు ఎవరితేనైన కలవ వచ్చు కానీ మిగతా సమాజిక వర్గాల వారు కలసి ఉండకూడదని, చంద్రబాబు పాలనలో వర్షాలు పడవని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేసారు.
Also Read: New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!