E-Paper
Advertisement

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!
Advertisement

Smart Car Buying Tips: ఒకప్పుడు కొత్త కారు కొనాలంటే నేరుగా షోరూమ్‌కు వెళ్లి సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన వివరాల ఆధారంగా నిర్ణయం తీసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ముందుగానే కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఫీచర్లు, ధర, భద్రత, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు లాంటి అంశాలను కంపార్ చేసిన తర్వాతే ఏ కారు కొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు.

ప్రతి సెగ్మెంట్ లో పలు మోడళ్లు

ప్రస్తుతం మార్కెట్లో ప్రతి సెగ్మెంట్‌ లో పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. సో, కారు కొనడానికి ముందు సెర్చ్ చేయడం చాలా అవసరం. ఒకే మోడల్‌ లో కూడా వేర్వేరు వేరియంట్లు ఉండటంతో, ఏ వేరియంట్ తమ అవసరాలకు సరిపోతుందో తెలుసుకోవడానికి చాలామంది ముందుగానే డీటైల్స్ చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మారుతి సుజుకి బ్రెజ్జాను తీసుకుంటే, ఇందులో సన్‌ రూఫ్, హెడ్ అప్ డిస్‌ ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్లు అన్ని వేరియంట్లలో ఉండవు. అందుకే కొనుగోలుదారులు ముందుగానే ఏ వేరియంట్‌ లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

భద్రత విషయంలో జాగ్రత్త

Advertisement

ఈ రోజుల్లో భద్రత కూడా కారు కొనుగోలులో కీలక అంశంగా మారింది. కేవలం మంచి లుక్, తక్కువ ధర చూసి కారు కొనడం కంటే, అందులో ఉన్న భద్రతా వ్యవస్థలను కూడా చాలామంది పరిశీలిస్తున్నారు. బ్రెజ్జాలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ వ్యూ కెమెరా లాంటి పలు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇలాంటి అంశాలను ఇతర కార్లతో పోల్చి చూసిన తర్వాత సరైన ఎంపిక చేసుకోవచ్చు.

మెయింటెనెన్స్ ఖర్చులు

కారు కొనడం అంటే.. కేవలం డబ్బులు చెల్లించడం మాత్రమే కాదు. భవిష్యత్తులో వచ్చే మెయింటెనెన్స్ ఖర్చులు, ఫ్యూయెల్ ఖర్చు, వారంటీ, సర్వీస్ సౌకర్యాలు లాంటి అంశాలను కూడా ముందుగానే తెలుసుకోవాలి.  బ్రెజ్జా పెట్రోల్‌ తో పాటు S CNG వెర్షన్‌ లో కూడా లభిస్తోంది. సో, తమ వినియోగానికి అనుగుణంగా ఏ పవర్‌ ట్రెయిన్ సరిపోతుందో కొనుగోలుదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

డిజిటల్ ప్లాట్‌ ఫారమ్స్ తో కంపారిజన్!  

Advertisement

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ ఫారమ్స్ వల్ల కార్ల కంపారిజన్ అనేది చాలా ఈజీ అయ్యింది. ఒకే చోట కార్ల ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వేరియంట్లు, పోలికలు చూసే అవకాశం లభిస్తోంది. అనేక వెబ్‌ సైట్లు తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ACKO Drive లాంటి సైట్లలో వేర్వేరు కార్లను పోల్చుకోవడం, ధరలు తెలుసుకోవడం, ఫీచర్లు పరిశీలించడం మాత్రమే కాకుండా, ఆన్‌ లైన్‌ లోనే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.  కారు సెలెక్షన్ నుంచి కొనుగోలు వరకు మొత్తం ప్రక్రియ మరింత ఈజీగా మారుతోంది.

సో, కొత్త కారు కొనాలనుకునే వారు తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ముందుగా పూర్తి స్థాయిలో చెక్ చేయడం మంచిది. ఫీచర్లు, భద్రత, మెయింటెనెన్స్ ఖర్చు, పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, తమ అవసరాలకు సరిపోయే బెస్ట్ కారును సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: మారుతి బ్రెజ్జా సూపర్ హిట్.. 15 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!

Related News

ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

పుతిన్ ఆరస్ vs జిన్‌ పింగ్ హాంగ్‌ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్‌ ఫుల్?

80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!

కారు కాదు.. కదిలే కోట.. జిన్‌పింగ్ హాంగ్‌కీ N701 ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఎండ్ల బండిపై హయ్.. హయ్.. మారుతీ కారులో రయ్ రయ్.. 80’s జర్నీ మరపురానిది!

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

Big Stories

Advertisement
×