BigTV English

Ysrcp: ముంబై హీరోయిన్‌‌ని వేధించిన వైసీపీ నేతలు.. ఆ రాత్రి ఏం జరిగింది?

Ysrcp: ముంబై హీరోయిన్‌‌ని వేధించిన వైసీపీ నేతలు.. ఆ రాత్రి ఏం జరిగింది?

Ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేత ఎందుకు ముంబై హీరోయిన్‌ని వేధించాడు? పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడా? ఈ వ్యవహారంలో ఆనాటి పెద్దలు ఎంతమంది ఉన్నారు? పోలీసుల పాత్ర ఏమిటి? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై అసలేం జరిగింది? ఇంకా డీటేల్స్ లోకి వెళ్తే..


ఏపీలో ముంబై నటి అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ నేతల ప్రమేయంతో ఆమెని అరెస్టు చేశారంటూ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ నేతల ప్రమేయంపై సోషల్‌మీడియాలో టీడీపీ ఆరోపణలు గుప్పించింది. దీనికి పార్టీ అధినేత జగన్ కచ్చితంగా సమాధానం చెప్పాలన్నది అధికార పార్టీ డిమాండ్. నటి వేధింపుల వ్యవహారంపై తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని విజయవాడ సీపీ అంటున్నారు. ఫిర్యాదు చేస్తే అప్పుడు విచారణ చేయిస్తామని చెప్పారు.

ఆ నటిపై ఫిబ్రవరి రెండున పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేత సాగర్. తనను ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందంటూ ఫిర్యాదు చేశారాయన. సాగర్ ఫిర్యాదుతో నటి ఫ్యామిలీని అరెస్టు చేసినట్టు విజయవాడ వార్తలు జోరందుకున్నాయి. కొండపల్లి‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో నటి కుటుంబాన్ని బంధించి వేధించారనే ఆరోపణలు లేకపోలేదు.


ALSO READ: ఇసుక దందాపై జేసీ ఫైర్.. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్

తమ మాట వినకపోవడంతో నటిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారట పోలీసులు. 15 రోజుల తర్వాత వెనక్కి తగ్గడంతో బెయిల్ వచ్చిందని సమాచారం. గతంలో స్టీల్ యజమాని‌పై ఫిర్యాదు చేసింది ఆ నటి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారన్నది అందులోని మేటర్. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. విజయవాడలో అరెస్టు తర్వాత ముంబైలో కేసు విత్ డ్రా చేసుకుంది ఆ నటి. దీంతో విజయవాడ కేసుకు ముంబై కేసుకు లింక్ ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ కుమారుడు కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ మ్యారేజ్‌కి హాజరయ్యారు. అక్కడ ముంబైకి చెందిన సినీనటితో పరిచయం కాస్త రిలేషన్‌గా మారింది. వారిద్దరు కొన్నాళ్లుగా క్లోజ్‌గా ఉన్నారని, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని మాజీ ఛైర్మన్‌ కొడుకును ఒత్తిడి చేసిందట. దీనికి ఆ వ్యక్తి నిరాకరించడం జరిగిందట. ఈలోగా ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ వ్యవహారం బయటపడితే పార్టీ ఇమేజ్ డ్యామేజీ అవుతుందని భావించి అప్పటి ప్రభుత్వ పెద్దగా వ్యవహరిస్తున్న ఓ నేతను వైసీపీ నేత ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

వైసీపీ నేతల ఒత్తిడితో బాధిత కుటుంబాన్ని ముంబైకి తరలించారట. ఫిబ్రవరిలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై భారీగా సొమ్ములు చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది.  ఇదంతా చివరకు కూటమి నేతల చెవిలో పడింది. దీంతో గత వైసీపీ ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది టీడీపీ సోషల్‌‌మీడియా విభాగం. దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×