lunar eclipse: ఈ చంద్ర గ్రహణం నుంచి కొన్ని రాశుల జాతకులకు అఖండ రాజయోగం పట్టనుందట. ప్రతి విషయంలో ఆ రాశుల వారు చక్రం తిప్పబోతున్నారట. ఇన్ని రోజులు పడిన శ్రమకు ఈ చంద్రగ్రహణం పులిస్టాప్ పెట్టి మంచి రోజులు తీసుకురానుందట. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం ఏర్పడబోయే సంపూర్ణ చంద్ర గ్రహణం నాలుగు రాశుల జాతకుల జాతకాలను మార్చబోతుందట. వచ్చే ఆరు నెలలు ఆ రాశుల జాతకులకు అఖండ రాజయోగం పట్టబోతుందట. వారు అని రంగాల్లో చక్రం తిప్పబోతున్నారట. ఇంతరీ ఆ 4 రాశుల జాతకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశి వారికి ఈ చంద్ర గ్రహణం వల్ల సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆరు నెలల పాటు ధనస్సు రాశి వారు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కునే యోగం బ్రహ్మండంగా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ అమ్ముకోవాలనుకున్నా కూడా చాలా మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంటుంది. వచ్చే ఆరు నెలల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది.
సంపూర్త చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి. ఈ రాశి వాళ్లకు ఆరో స్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ రాశి వారికి విశేషమైన రాజయోగాన్ని కల్గింపజేస్తుంది. ఆరు నెలల వరకు కన్యా రాశి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ఈ రాఝశి వారు తీర్చగలుగుతారు. రుణ బాధల నుంచి కన్యారాశి వారు సంపూర్ణంగా బయటపడతారు. శత్రు బాధలు సమూలంగా తొలగిపోతాయి.
సంపూర్ణ చంద్ర గ్రహణం వల్ల రాజయోగం పట్టబోయేది. చక్రం తిప్పబోయేది ఈ రాశి. వృషభ రాశికి దశమ స్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారు వచ్చే ఆరు నెలల పాటు ఏ రంగంలో ఉన్నా..చక్రం తిప్పుతారు. వృత్తి పరంగా టాప్‌లోకి వెళ్లిపోతారు. హోదా స్థాయి స్టేటస్ బ్రహ్మండంగా పెరిగిపోతాయి. కేరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగడానికి వృషభ రాశి వాళ్లకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బ్రహ్మండమైన ప్రమోషన్లు వస్తాయి. ఈ ఆరు నెలల్లో గవర్నమెంట్ జాబ్ కొట్టే యోగం ఉంది.
ఈ రాశి వాళ్లకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పదకొండో స్థానంలో ఏర్పడుతుంది. ఏకాదశం అంటేనే లాభం. అంటే మేష రాశి వారికి లాభ స్థానంలో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారికి ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, కుటుంబ లాభం ఏర్పడతాయి. అన్ని విషయాలలో అన్ని వ్యవహారాలలో మేష రాశి వారికి ఆరు నెలల పాటు విశేషమైన రాజయోగం, అద్బుతమైన లాభాలు చేకూరతాయి. బ్రహ్మాండంగా చక్రం తిప్పబోతున్నారు.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.