BigTV English
Advertisement

Nita Ambani: నీతా అంబానీ A2 పాలే తాగుతుందా? వాటి ప్రత్యేకత తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Nita Ambani: నీతా అంబానీ A2 పాలే తాగుతుందా? వాటి ప్రత్యేకత తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. తినే ఆహారంలో, తాగే డ్రింక్ లో పోషక విలువల గురించి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే A2 పాలు అనే సరికొత్త బ్రాండ్ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. రీసెంట్ గా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, పూణేలోని మహాలక్ష్మి డైరీకి చెందిన లీటరుకు రూ. 2,000 ఖరీదు చేసే పాలు తాగుతున్నారన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ పాటను A2 పాలుగా పిలుస్తున్నారు. సాధారణ పాలకు భిన్నంగా A2 ప్రోటీన్ ను కలిగి ఉండటంతో పాటు, మెరుగైన పోషక విలువలను అందిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఈ A2 పాలు అంటే ఏంటి? ఎందుకు వీటికి అంత ధర? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


 A2 పాల ప్రత్యేకతలు ఇవే!

మనకు లభించే సాధారణ ఆవు పాలలో బీటా-కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ బీటా కేసిన్ లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.  A1, A2 పాలు. ఆధునిక ఆవుల జాతులు అంటే హోల్‌ స్టీన్ ఫ్రీసియన్ లాంటివి తమ పాలలో A1,  A2 ప్రోటీన్ల మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని పురాతన జాతుల ఆవులు లేదంటే  కొన్ని ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఆవులు మాత్రం తమ పాలలో కేవలం A2 ప్రోటీన్ ను మాత్రమే అందిస్తాయి. వీటిని A2 పాలు అంటారు.


A1, A2 ప్రొటీన్ల మధ్య తేడా ఏంటి?

A1 బీటా-కేసిన్ జీర్ణం అయినప్పుడు, బీటా-కాసోమోర్ఫిన్-7 (BCM-7) అనే ఒక ప్రత్యేకమైన పెప్టైడ్ విడుదల అవుతుంది.   ఈ BCM-7 ను కొందరిలో జీర్ణ సమస్యలు, కడుపులో అసౌకర్యం, ఉబ్బరం,  మంట లాంటి సమస్యలు కలిగే అవకాశం ఉందంటున్నారు. A2 పాలలో ఈ BCM-7 విడుదల కాదు. అందువల్ల, A2 పాలు సులభంగా జీర్ణం అవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయిజ ఈ కారణంగానే, A2 పాలకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన, ప్రీమియం గుర్తింపు ఉంది.

A2 పాలు ఇచ్చే ఆవులను ఎలా పెంచుతారంటే?

నీతా అంబానీ వాడే ప్రీమియం A2 పాలను, మహాలక్ష్మి డైరీలో అత్యంత అధునాతనమైన, వినూత్నమైన పెంపకం పద్ధతుల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఈ పద్ధతులే పాల ధర ఎక్కువగా ఉండేందుకు కారణం అవుతుంది.

⦿ RO శుద్ధి చేసిన నీరు: A2 పాలు ఇచ్చే హోల్‌ స్టీన్ ఫ్రీసియన్ ఆవులకు సాధారణ నీరు కాకుండా, రివర్స్ ఆస్మాసిస్ (RO) పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని అందిస్తారు. దీనివల్ల నీటిలో ఉండే ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా చూస్తారు. ఇవి పాల నాణ్యతను గణనీయంగా పెంచుతాయి.

⦿ పరిశుభ్రమైన మ్యాట్స్: ఆవులను పెంచే చోట, అవి పడుకోవడానికి, నిలబడటానికి ప్రత్యేకంగా పరిశుభ్రమైన మ్యాట్స్ ను ఉపయోగిస్తారు. ఇవి ఆవుల పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతమైన ఆవులు  నాణ్యమైన పాలను అందిస్తాయి.

⦿ ప్రత్యేకంగా రూపొందించిన దాణా:  ఆవులకు ఇచ్చే దాణా కూడా సాధారణమైనది కాదు. పాలలో పోషకాలను, ముఖ్యంగా కొన్ని ప్రయోజనకరమైన కొవ్వు ఆమ్లాలను పెంచడానికి ప్రత్యేకంగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన దాణాను అందిస్తారు. ఈ ప్రత్యేక దాణా వల్ల పాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కన్జుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (CLA) వంటివి అధిక స్థాయిలో ఉంటాయి.

నీతా అంబానీ A2 పాలను ఎంచుకోవడం అనేది కేవలం ఒక వ్యక్తిగత ప్రాధాన్యత మాత్రమే కాదు, సైన్స్, లగ్జరీ, ఇన్నోవేషన్ కు ప్రతిబింబంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పాలకు మరింత ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also: రైల్వే ఫుడ్ మరీ అంత చెత్తగా ఉంటుందా? ఏడాదిలో అన్ని ఫిర్యాదులా?

Related News

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Viral Video: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

Viral News: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. న్యూస్ పేపర్‌లో ఊహించని ప్రకటన, ఎవరు ఆ ఆత్మారాం?

Pregnancy Job Scam: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?

Big Stories

×