Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 12వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. దూరం ప్రాంతాల నుండి అందవలిసిన సమాచారం అందుతుంది. రవాణా మార్గం ద్వారా విలువైన వస్తువులు చేరుకుంటాయి. మీ మనస్సులోని భావనలు ఇతురులకు తెలియకుండా జాగ్రత్త పడుతారు. భాగస్వామ్య వ్యాపారంలో నిజాయితీగా వ్యవహరించండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసివచ్చేరంగు: ఆర్మీ గ్రీన్
సూర్యనమస్కారాలు చేయండి గణపతిని గరికతో పూజించండి.
వృషభరాశి: కమ్యునికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. మధ్యవర్తిత్వం ద్వారా ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. వివిధ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారత్వం కలుగుతుంది. స్థిరమైన అభిప్రాయాల ద్వారా అభివృద్ధి సాధిస్తారు. కొన్ని విషయాల్లో మీపై అధికారులకు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 7
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ రంగు
గణపతికి 16 ఉండ్రాల్లు నైవేద్యంగా సమర్పించండి.
మిథునరాశి: నూతన వ్యాపారాలని ప్రారంభించడానికి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వాధికారులతో చర్చలు జరుపుతారు. కొన్ని ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమవుతాయి. పితృవర్గ సూతకం కలుగవచ్చు. ఆలోచనల్లో స్థిరత్వాన్ని కోల్పోవద్దు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసివచ్చేరంగు: ఎరుపురంగు
కందులు, బెల్లం సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి.
కర్కాటకరాశి: మీ ప్రతిభకు తగిన ఫలితం లభిస్తుంది. మీచుట్టూ ఉన్నవారు మిమ్మల్ని కీర్తిస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. సరియైన మార్గంలో డబ్బు ఖర్చు చేస్తారు. తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: పసుపు పచ్చరంగు
దుర్గాదేవికి పసుపు పచ్చరంగు గాజులు సమర్పించండి.
సింహరాశి: దైవానుగ్రహంతో అవకాశాలు అందుతాయి. పూర్వవైభవాన్ని పొందుతారు. నరదృష్టి అధికంగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు. కష్టేఫలి అనే సూత్రంతో ముందుకు సాగుతారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2
కలిసి వచ్చేరంగు: తెలుపు
గణపతిదేవాలయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేయండి గోసేవ చేయండి.
కన్యారాశి: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణ ఒత్తిడి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంపై ఇతరుల జోక్యం నచ్చదు. అకారణ కోపం పనికి రాదు. ధనాపేక్ష కలుగుతుంది. సంపాదనకై కొత్త మార్గాలలో అన్వేషిస్తారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 5
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ రంగు
సూర్యనారాయణ స్వామికి ఆవుపాలలో గంధం కలిపి తర్పణాలు ఇవ్వాలి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: పిత్రార్జితాన్ని పొందుతారు. అదృష్టవశాత్తు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. లాటరి ప్రైజులు గెలుచుకుంటారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శతృవులు మిమ్మల్ని శరణు వేడుతారు. గతంలో మీపై వచ్చిన అభాండాలు తొలిగిపోతాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: గులాబీరంగు
గోశాలలో మంచి శనగలు దానం చేయండి.
వృశ్చికరాశి: పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరుతారు. ఆందోళనతో గడుపుతారు. మీ ప్రవర్తనతో కుటుంబ సభ్యులను ఆప్తులను విసిగిస్తారు. అనుమానంతో అయినవారిని దూరం చేసుకుంటారు. మర్యాదను కోల్పోతారు. అవసరాలకు సరిపడా ధనం అందుతుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసివచ్చేరంగు: నీలంరంగు
దుర్గాదేవికి మినప గారెలు సమర్పించండి.
ధనస్సురాశి: చేపట్టిన పనులలో ఆటంకాలు. అధికారుల సహాయనిరాకరణ వల్ల నిరాశకు గురవుతారు. మీకు రావాల్సిన అవకాశాలు వేరొకరు అందిపుచ్చుకుంటారు. సోదరులతో కలిసి చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. సహధర్మచారిణి సలహాలు స్వీకరించండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 6
కలిసి వచ్చేరంగు: ఎరుపురంగు
నరసింహస్వామికి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించండి.
మకరరాశి: గృహనిర్మాణ పనుల్లో వేగం పెంచుతారు. బంధువులను పరామర్శిస్తారు. ఆత్మీయులతో సమావేశం ఆనందం కలిగిస్తుంది. మేనత్త, మేనమామ తరుపున ముఖ్యమైన శుభవార్త అందుతుంది. పాతపగలు పక్కన పెడుతారు. సంపదలు శాశ్వతం కాదని భావిస్తారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: లేతనీలం రంగు
కాలభైరవాష్టకం 8 సార్లు పఠించండి అమ్మవారి ఆలయంలో కూష్మాండ దానం చేయండి.
కుంభరాశి: పట్టుదలతో ప్రయత్నించి విజయాలు పొందుతారు. చర్మంపై గాయాలు బాధిస్తాయి. వైద్యుల సలహాలతో మందులు వాడాల్సి ఉంటుంది. సమయస్పూర్తితో గండాల నుండి తప్పించుకుంటారు. అనుకోని ఖర్చులు మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ఆత్మీయుల సహకారంతో వాస్తవికతకు దగ్గరవుతారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 5
కలిసి వచ్చేరంగు: నారింజ రంగు
శివాలయదర్శనం చేయండి వీధికుక్కలకి ఆహారం అందించండి.
మీనరాశి: సుధీర్ఘమైన ఆలోచనల్లో గడుపుతారు. భవిష్యత్ కార్యచరణకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొంతవరకు రహస్యమార్గాన్ని అవలంబిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. సమాచార లోపం వల్ల కొంతవరకు నష్టాన్ని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: గంధంరంగు
పంచామృతాలతో శివలింగానికి అభిషేకం జరిపించండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే