Rain Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు..
ఇవాళ వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
నేడు కోస్తాలో చెదురుముదురుగా భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఉదయానికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా సమీపంలో గోపాలపూర్ వద్ద తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-60 కీలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఇవాళ కోస్తాలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఉమ్మడి తూ. గో జిల్లాలో భారీ వర్ష సూచన రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్ష సూచన కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఒక పక్క భారీ వర్షం మరో పక్క పెరుగుతున్న వరద..
ఒక పక్క భారీ వర్షం మరో పక్క పెరుగుతున్న వరద కారణంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రైతులను సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలుగు లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
RED ALERT: నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు
ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ… pic.twitter.com/ItCgbS4poo
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025