Women’s Nature: ఎలాంటి అమ్మాయిలు తమ భర్తలను బాగా ఇబ్బంది పెడతారో తెలుసా..? ఎలాంటి అమ్మాయిలకు ప్రేమలో స్పష్టత ఉండదో తెలుసా..? ఎలాంటి అమ్మాయిలు తమ భాయ్‌ఫ్రెండ్స్‌ను అసహనానికి గురి చేస్తుంటారో తెలుసా..? ఎలాంటి అమ్మాయిలు తమ లవర్ మీద కానీ భర్త మీద కానీ తమ పెత్తనాన్ని రుద్దాలని చూస్తారో తెలుసా..? ఇలాంటి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశుల్లో పుట్టిన అమ్మాయిలకు ఒక్కోక్కరికి ఒక్కోలా మనస్తత్వం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే ఎక్కువగా కొన్ని రాశుల్లో పుట్టిన అమ్మాయిలకు మాత్రం స్వతంత్ర బావాలు ఎక్కువగా ఉంటాయట. అలాంటి అమ్మాయిలు తాము చెప్పిందే వేదం అన్నట్టుగా జరగాలని కోరుకుంటారు. ఇలాంటి అమ్మాయిలకు లీడర్‌షిప్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయట. అందుకే వీరు తమ భర్తలు లేదా బాయ్‌ఫ్రెండ్స్ కూడా తమ మాటే వినాలని డిమాండ్ చేస్తారట. చేయడమే కాదు మాట వినకపోతే ఇబ్బంది పెడతారట. మరి ఆ రాశులేవో.. ఆ అమ్మాయిల లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి స్త్రీలు ధైర్యంగా స్వతంత్రంగా ఉంటారు. తమ నిర్ణయాలు తామే తీసుకోవాలనుకుంటారు. మితి మీరిన తలపోటుతనం, ఉగ్రత,అంతర్గత అసహనం వారి జీవిత భాగస్వాములపై ఒత్తిడిగా మారుతుంది. వారు అగ్ని వలె ఎప్పుడూ ఉద్వేగంతో ఉంటారు.
వృశ్చిక రాశి: ఇతరుల భావోధ్వేగాలను అర్థం చేసుకోవడంలో మెలకువగా ఉండే ఈ స్త్రీలు, మౌనంగా చూస్తూ ప్రతి దానిని లోతుగా పరిశీలిస్తారు. వారి కోపం అనుమానం మరియు ప్రతికార స్వభావం సంబంధాలలో అనేక బావోధ్వేగ సంఘర్షణలకు కారణమవుతాయి.
మిథున రాశి: ఈ రాశి స్త్రీలు తమ మాటలతో చురుగ్గా ఉంటారు. మరియు వారి భావాలలో తీవ్ర మార్పులు ఉంటాయి. వారి ద్వంద్వ స్వభావం వారిని అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తుంది. ప్రేమలో స్పష్టత లేకపోవడం మరియు చిన్న విషయాలపై కూడా అభిప్రాయాలు మారడం వల్ల భర్తకు గందరగోళం ఏర్పడుతుంది.
సింహ రాశి: గర్వం, అహంకారం, మరియు గెలవాలనే పోటీతత్వం ఈ రాశి స్త్రీల లక్షణాలు. వారు ఎల్లప్పుడూ ప్రసిద్ది చెందాలని కోరుకుంటారు. మరియు తమ మాటే చివరి మాట అని భావిస్తారు. ఈ స్వభావం కారణంగా వారు తమ భర్తల కంటే ఎక్కువగా ఉండాలని పట్టుబడతారు. ఇది సంబంధంలో ఒత్తిడిని పెంచుతుంది.
ధనస్సు రాశి: స్వేచ్చను ప్రేమించే ఈ స్త్రీలు నిరంతరం కొత్త అనుభవాల కోసం పయనిస్తుంటారు. వారి తాత్విక స్వభావం కారణంగా వారు స్థిరంగా ఉండలేరు. దీని వలన స్థిరత్వాన్ని కోరుకునే భాగస్వామి పట్ల వారు అసహనానికి గురవుతారు. వారు ఎల్లప్పుడు తమ స్వంత ఆనందానికి ప్రాధాన్యత ఇస్తారు.
కుంభ రాశి: ఆలోచనల్లో వైవిధ్యం, ప్రవర్తనలో స్వేచ్చ కలిగిన కుంభ రాశి స్త్రీలు తమ అభిప్రాయాల్లో చాలా ధృఢంగా ఉంటారు. వారి మొండితనం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం వల్ల భర్తలో సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఇంట్లో దీపాలు పెడుతున్నారా..? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే..?